YS Jagan: వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మామయ్య కి మామూలు కష్టాలు కాదు, వైఎస్‌ జగన్ కూడా డీల్ చెయ్యలేకపోతున్నాడు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan: వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మామయ్య కి మామూలు కష్టాలు కాదు, వైఎస్‌ జగన్ కూడా డీల్ చెయ్యలేకపోతున్నాడు !

 Authored By himanshi | The Telugu News | Updated on :30 January 2021,1:50 pm

YS Jagan: వైకాపా మంత్రులకు ఎమ్మెల్యేలు ఎంపీలకు స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి చాలా పెద్ద ప్రహసనంగా మారాయి. తమ సొంత నియోజక వర్గాల్లో సొంత జిల్లాల్లో వైకాపాను గెలిపించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. సీఎం వైఎస్‌ జగన్‌ ముద్దుగా వాసు మామ అని పిలుచుకునే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఇప్పుడు కాస్త కష్టాల్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతి మంత్రికి ఒక్కో జిల్లా చొప్పున అప్పగించి బాధ్యతలు చూసుకోవాలని, ఏం చేసైనా కూడా మెజార్టీ సాధించాలంటూ ఆదేశించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రకాశంలో వైకాపాకు ఎదురు గాలి వీస్తున్నట్లుగా రిపోర్ట్‌ లు అందుతున్నాయి. పూర్తి స్థాయిలో కాకున్నా కూడా తెలుగు దేశం పార్టీ గాలి మాత్రం కాస్త ఎక్కువగానే ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే అక్కడ ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకోవాలని మంత్రి భావిస్తున్నాడు.

YS Jagan: కిందా మీదా పడుతున్న మంత్రి బాలినేని..

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరియు ఇతర ఎన్నికల అధికారుల కారణంగా ఏకగ్రీవాలకు సమస్యగా మారింది. భయపెట్టి బలవంతంగా ఏకగ్రీవం చేయడం ఏంటీ అంటూ ప్రజలు కొందరు ఎదురు తిరుగుతూ ఉండగా మరి కొందరు మాత్రం వైకాపాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంఘం వారు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు చేస్తున్న ఏకగ్రీవాలపై దృష్టి సారించారు. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏకగ్రీవాలు కాకుండా చూస్తున్నారు. దాంతో బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఏం చేయాలో పాలు పోక కిందా మీద పడుతున్నారని అంటున్నారు.

అక్కడ కూడా టీడీపీ ఫుల్‌ స్వింగ్‌..

ప్రకాశం జిల్లాలో బాపట్ల పార్లమెంట్‌ నియోజక వర్గంలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా తెలుగు దేశం పార్టీ జోరు కనిపిస్తుంది. అక్కడ కాస్త దృష్టి పెట్టకుంటే వైఎస్‌ జగన్ కు గట్టి దెబ్బ తప్పదంటూ రాజకీయ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వైఎస్‌ జగన్‌ ప్రకాశం జిల్లా విషయంలో ఎక్కువ దృష్టి పెట్టాడనే వార్తలు వస్తున్నాయి. అయినా కూడా అక్కడ డీల్‌ చేయడంలో మంత్రి బాలినేని మరియు సీఎం వైఎస్‌ జగన్‌ విఫలం అవుతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం ప్రకాశం జిల్లాలో మాత్రమే కాకుండా మరో రెండు మూడు పార్లమెంట్‌ నియోజక వర్గం పరిధిలో కూడా టీడీపీ ఫుల్‌ స్వింగ్ లో దూసకు పోతుందని విశ్లేషకులు అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది