YS Sharmila : నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు .. వై.ఎస్.షర్మిల..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు .. వై.ఎస్.షర్మిల..!

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు .. వై.ఎస్.షర్మిల..!

YS Sharmila : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వై.యస్.షర్మిల బాధ్యతలు స్వీకరించారు. జనవరి 23 నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు. విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యమని, తాను ఎవరు వదిలిన బాణం కాదని వ్యాఖ్యానించారు. మహిళా కదా అని తక్కువ చేసి మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణలో ఒక నియంతను అధికారం నుంచి దించాను అని చెప్పారు. స్వార్థం కోసం చూసుకోలేదు అని అన్నారు. తెలుగు ప్రజలు బాగుపడాలి కాబట్టే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆమె తెలిపారు. రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతుందన్నారు. తనకు ఏపీ పుట్టినిల్లు, తెలంగాణ మెట్టినిల్లు అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే తనను విమర్శిస్తారని షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేయడం. ఆ మాట కోసం పనిచేస్తున్నానని, తెలంగాణలో ఓ నియంతను గద్దె దించాం, నా పాదయాత్ర ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బయటపడింది అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీని విలీనం చేశారని ఆమె అన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నియంతలా వ్యవహరిస్తారని ఆమె మండిపడ్డారు. జాతీయ పార్టీలు అలా ఉండదన్నారు. ఏపీలో 175 స్థానాలు 25 ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుందన్నారు. జనవరి 23 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటన జరుగుతుందని చెప్పారు. 9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పర్యటనలు ఉంటాయని, పార్టీలో చేరికలు కూడా ఉంటాయని ఆమె తెలిపారు.

మరోవైపు టీడీపీ, వైసీపీ, బీజేపీల పైన షర్మిల విమర్శల గుప్పించారు. మణిపూర్ లో సంఘటనల వలన దేశానికి బీజేపీ అవసరం లేదన్నారు. మణిపూర్ లో అంత జరుగుతున్న క్రిస్టియన్ అయిన సీఎం జగన్ స్పందించలేదన్నారు. పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ కి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యాయని ఆమె అన్నారు. ఏపీలో 25 మంది ఎంపీలు బీజేపీ వాళ్లేనని షర్మిల చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అని తెలిపారు. ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలు చెబుతారని షర్మిల వ్యాఖ్యానించారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది