YS Sharmila : మొదటి పత్రిక మా జగనన్నకే.. చాలాకాలం తర్వాత అన్నను కలిసిన వై.యస్.షర్మిల..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Sharmila : మొదటి పత్రిక మా జగనన్నకే.. చాలాకాలం తర్వాత అన్నను కలిసిన వై.యస్.షర్మిల..!!

 Authored By aruna | The Telugu News | Updated on :3 January 2024,7:13 pm

ప్రధానాంశాలు:

  •  YS Sharmila : మొదటి పత్రిక మా జగనన్నకే.. చాలాకాలం తర్వాత అన్నను కలిసిన వై.యస్.షర్మిల..!!

YS Sharmila : వై.యస్.షర్మిల తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి తో బుధవారం నాడు సాయంత్రం భేటీ అయ్యారు.తన కొడుకు వై.యస్.రాజారెడ్డి వివాహ పెళ్లి ఆహ్వాన పత్రికను వై.యస్.షర్మిల తన సోదరుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి అందించారు. కడప నుండి వై.యస్.షర్మిల ప్రత్యేక విమానంలో సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి కి చేరుకున్నారు. తాడేపల్లి లో సీఎం క్యాంప్ కార్యాలయంలో వై.యస్.షర్మిల తన అన్నతో భేటీ అయ్యారు. ఆమెతోపాటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. తన కొడుకు వివాహాన్ని పురస్కరించుకొని అందరికీ ఆహ్వాన పత్రికలు ఇవ్వాలి కదా అని ఆమె మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో మీతో ఎవరెవరు చేరుతారు అనే విషయంపై ఆమె సమాధానం చెప్పలేదు. తనకు సమయం లలేదని, నకు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరారు. వై.యస్.షర్మిల తాను ఏర్పాటు చేసిన వైయస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో విభేదించి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ సీపీని ఏర్పాటు చేసిన సమయంలో షర్మిల కూడా జగన్ తో ఉన్నారు. అయితే కొన్ని కారణాలతో ఆమె తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు వైయస్సార్ టీపీని ఏర్పాటు చేశారు. తాను ఏర్పాటు చేసిన వైయస్సార్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నారు.

ఈనెల 17వ తేదీన వై.ఎస్.షర్మిల తన కొడుకు వై.యస్.రాజారెడ్డికి అట్లూరి ప్రియతో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే నెల 13న రాజారెడ్డి ప్రియకు వివాహం జరగనుంది. ఈ కార్యక్రమాలకు జగన్ వై.ఎస్.షర్మిల ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరగనున్నాయి. అధికార వైయస్సార్ సీపీ పార్టీపై గెలిచేందుకు జనసేన, టీడీపీ కూటమి వ్యూహాలకు పదును పెడుతుంది. ఇక వై.యస్.జగన్మోహన్ రెడ్డి కూడా వరుస సంక్షేమ పథకాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అనేదానిపై చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలోనే వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరడం సెన్సేషనల్ గా మారింది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది