Ys Sharmila : షర్మిల ఓవరాక్షన్ .. వైఎస్ జ‌గ‌న్‌ కు బెనిఫిట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Sharmila : షర్మిల ఓవరాక్షన్ .. వైఎస్ జ‌గ‌న్‌ కు బెనిఫిట్..!

Ys Sharmila : ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా పగ్గాలు దక్కిన వెంటనే వై.యస్.షర్మిల కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ఇచ్చాపురం నుంచి యాత్ర కూడా మొదలుపెట్టారు. అచ్చంగా ఎన్నికలు వచ్చేసిన స్థాయిలో వ్యవహరిస్తున్నారు. బస్సు ప్రయాణం అంటే గిమ్మిక్కులు బహుశా ఈ దశలో ఆమెకు అవసరం కావచ్చు కానీ చాలా దూకుడుగా మాట్లాడే స్వభావం ఉన్న షర్మిల ప్రతిపక్షాలను విమర్శించడంలో కాస్త అతి చేస్తున్నారని అభిప్రాయం కొందరికి కలుగుతుంది. ఆమె అతి చేయడం ఒక ఎత్తు అయితే అన్న […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  Ys Sharmila : షర్మిల ఓవరాక్షన్ .. వైఎస్ జ‌గ‌న్‌ కు బెనిఫిట్..!

Ys Sharmila : ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా పగ్గాలు దక్కిన వెంటనే వై.యస్.షర్మిల కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ఇచ్చాపురం నుంచి యాత్ర కూడా మొదలుపెట్టారు. అచ్చంగా ఎన్నికలు వచ్చేసిన స్థాయిలో వ్యవహరిస్తున్నారు. బస్సు ప్రయాణం అంటే గిమ్మిక్కులు బహుశా ఈ దశలో ఆమెకు అవసరం కావచ్చు కానీ చాలా దూకుడుగా మాట్లాడే స్వభావం ఉన్న షర్మిల ప్రతిపక్షాలను విమర్శించడంలో కాస్త అతి చేస్తున్నారని అభిప్రాయం కొందరికి కలుగుతుంది. ఆమె అతి చేయడం ఒక ఎత్తు అయితే అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు అనే భ్రమలో ఆయన అవకాశాలకు గండి కొట్టాలని ఆలోచన లో షర్మిల చేస్తున్న అతి జగన్ కే మేలు చేసేలా ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది జగన్ సర్కార్ మీద షర్మిల వేస్తున్న ప్రధాన నింద. అభివృద్ధి ఉంటే చూపించండి నేను వస్తా అని ఆమె సవాల్ విసురుతున్నారు.

కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేయని విధంగా నాతోపాటు ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకొస్తా అని, మేధావులను కూడా తీసుకొస్తా అని, అభివృద్ధిని చూపించండి అని సవాలుకు కండిషన్స్ పెడుతున్నారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు స్ట్రైట్ గా తమ నియోజకవర్గానికి రమ్మని, అభివృద్ధిని చూపిస్తామని ప్రతి సవాళ్లు విసురుతున్నారు. అయితే షర్మిల ప్రతిపక్షాలను కూడా తీసుకువస్తానని అనడంతో ఆమె చంద్రబాబు నాయుడు గూటి చిలకగా ఈ పలుకులు పలుకుతుందని అందరికీ అర్థమవుతుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆమె వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి బీజేపీతో సంబంధం అంటగడుతున్నారు. జగన్ సర్కార్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిపోతుందని విమర్శిస్తున్నారు. రాహుల్ ని ప్రధాని చేయడం తన లక్ష్యం అంటున్న షర్మిల కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మనసును చురగొనడానికి పదేపదే ఏపీలో మనుగడలో లేని బీజేపీని పెద్ద భూతంగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న అతి కూడా జగన్ కు లాభమే అని పలువురు అంటున్నారు.

ఏపీలో బీజేపీ పార్టీ గెలిచేంత సత్తా లేకపోయినా వారికి కనీసం ఒక్క శాతం స్థిరమైన ఓటు బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు అయోధ్య రామ మందిర్ ప్రారంభం జరిగిన తర్వాత మోడీ పట్ల అభిమానం పెరిగిన తర్వాత ఓటు బ్యాంకు కనీసం ఒక శాతం వరకు ఉండవచ్చు. వీరు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు. టీడీపీ కూటమిలో బీజేపీ చేరకపోతే ఒంటరిగా పోటీ చేస్తుంది. అయినా ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ తెచ్చుకోలేదు. అలాంటప్పుడు బిజెపికి ఓటు వేసి వృధా చేసుకునే బదులుగా బిజెపితో సత్సంబంధాలు ఉన్న జగన్ కి ఓటు వేస్తే మేలు కదా అనే భావన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి భావన పుట్టించడానికి షర్మిల మాటలు దారి తీయవచ్చు. నేరుగా కనిపించకపోయిన బీజేపీకి జగన్ కు సంబంధాన్ని అంటగడుతూ షర్మిల చేస్తున్న ప్రచారం ఎంతో కొంత జగన్ కు మేలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. జగన్ ఓట్లను షర్మిల ఏ మేరకు చీల్చగలదో తెలియదు కానీ ఆమె చేస్తున్న అతి వల్ల కొంత మేర జగన్ కు లాభం ఉంటుందని ఊహిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది