Ys sharmila : వైఎస్ జగన్ నుంచి 82 కోట్లు, భారతి నుంచి 19 లక్షలు వైఎస్ షర్మిల అప్పు తీసుకుందా?
ప్రధానాంశాలు:
Ys sharmila : వైఎస్ జగన్ నుంచి 82 కోట్లు, భారతి నుంచి 19 లక్షలు వైఎస్ షర్మిల అప్పు తీసుకుందా?
Ys sharmila : ఆ మధ్య తెలంగాణ ఎలక్షన్ సమయంలో అందరి దృష్టిని ఆకర్షించిన షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కూడా కీలకంగా మారింది. అన్న ప్రభుత్వాన్ని గద్దె దింపేయాలని షర్మిల కృత నిశ్చయంతో దూసుకుపోతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు సైతం గుప్పిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అన్నచెల్లెళ్ల మధ్య ఈ గొడవలకి కారణం ఆస్తి వివాదాలే అని కొందరు అంటున్నారు. వైఎస్ షర్మిళ రీసెంట్‌గా కడప పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె తనకు ఉన్న అప్పులు, ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి వివరించారు. దీనిలో చాలా ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించడం గమనార్హం.
Ys sharmila : అంత అప్పు ఎందుకైంది..
తన ఆస్తులను రూ.182 కోట్లుగా పేర్కొన్న షర్మిల.. ఇదే సమయంలో తన అప్పులను కూడా వివరించారు. తనకు మొత్తంగా 82 కోట్ల, 77 లక్షల, 71 వెయ్యి 682 రూపాయల అప్పు ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే.. ఇదేమీ బయటి వారి నుంచి తీసుకున్నట్టు చెప్పలేదు. ఏటా తనకు రూ.97 లక్షల 14 వేల ఆదాయం వస్తుందన్న షర్మిల..భర్త అనిల్ కుమార్‌కు ఏటా రూ.3 లక్షల ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. అఫిడవిట్ ప్రకారం షర్మిల ఆస్తుల విలువ రూ.182.82 కోట్లుగా ఉంది. ఇందులో చరాస్తుల విలువ రూ.123.26 కోట్లుగా ప్రకటించారు షర్మిల. స్థిరాస్తుల విలువ రూ. 9.29 కోట్లుగా చెప్పారు. షర్మిల భర్త అనిల్ కుమార్ పేరిట రూ.45 కోట్ల విలువైన చరాస్తులు, రూ.4.05 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు.
రూ.3 కోట్ల 69 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.4 కోట్ల 61 లక్షల విలువైన జెమ్ స్టోన్స్ అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో స్పష్టం చేశారు షర్మిల. తనకు మొత్తంగా 82 కోట్ల, 77 లక్షల, 71 వెయ్యి 682 రూపాయల అప్పు ఉందని ఆమె పేర్కొన్నారు.తన తోబుట్టువు.. సీఎం జగన్ నుంచి 82 కోట్ల, 58లక్షల,15 వేలను అప్పుగా తీసుకున్నారు. అదేవిధంగా తన వదిన, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నుంచి 19లక్షల, 56 వేల, 682 రూపాయలను అప్పుగా తీసుకున్నట్టు అఫిడవిట్‌లో వివరించారు. మొత్తంగా జగన్ దంపతులకు వైఎస్ షర్మిల రూ.82 కోట్ల రూపాయలకు పైగానే అప్పు పడ్డారు. దీనిని తన వ్యక్తిగత అవసరాల కోసం తీసుకున్నట్టు వెల్లడించారు.