Kethireddy : రేవంత్ తప్పు చేశావ్.. రేవంత్ గెలిస్తే టీడీపీ హంగామా ఏంటి.. రేపు ఏపీలో కూడా అదే జరగబోతోంది.. ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kethireddy : రేవంత్ తప్పు చేశావ్.. రేవంత్ గెలిస్తే టీడీపీ హంగామా ఏంటి.. రేపు ఏపీలో కూడా అదే జరగబోతోంది.. ఎమ్మెల్యే కేతిరెడ్డి సీరియస్

Kethireddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ చీఫ్ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రెండో సీఎంగా రేపే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండటంపై, కాంగ్రెస్ గెలుపుపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై ఫైట్ చేయడం అనేది […]

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2023,7:00 pm

ప్రధానాంశాలు:

  •  హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణాలు ఇవే

  •  టీడీపీ బ్యాచ్ హడావుడి వల్లనే కాంగ్రెస్ ఓడిపోయింది

  •  ఒక సామాజిక వర్గాన్నే టార్గెట్ చేస్తే ఇలాగే ఉంటుంది

Kethireddy : రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ చీఫ్ కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి. తెలంగాణ రెండో సీఎంగా రేపే ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. తెలంగాణ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండటంపై, కాంగ్రెస్ గెలుపుపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై ఫైట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. అతడి తెగువకు మెచ్చుకోవాల్సిందే. కానీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారెంటీ హామీలు చాలెజింగ్ అనే చెప్పుకోవాలి. కర్ణాటకలోలా కాదు. ఇలాంటి స్కీమ్స్ కర్ణాటకలో కొత్త. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు కామన్. ఇవి నిరంతరం వస్తూనే ఉంటాయి. వాటిని మనం విజయవంతంగా అమలు చేయలేకపోతే క్రెడిబిలిటీ తగ్గుతుంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రస్తుతం సక్సెస్ కాలేకపోతోంది. తెలంగాణలో మరి వీళ్లు ఎలా నిలబెట్టుకుంటారో వేచి చూడాలి అని కేతిరెడ్డి అన్నారు.

ఇక ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టుగా తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ హడావుడి ఏంటో అర్థం కావడం లేదు. హైదరాబాద్ లో హడావుడి చేసి ఒక సామాజిక వర్గంగా విడిపోతే.. మిగితా సామాజిక వర్గాలన్నీ దూరం అవుతాయి. ప్రస్తుతం తెలంగాణలో అదే జరిగింది. మా సామాజిక వర్గమే అంటూ హడావుడి చేశారు. హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నది వీళ్లే. అయినా కూడా ఒక్క సీటు రాలేదు. సెటిలర్స్ లో వైసీపీ, టీడీపీ, జనసేన, కామన్ న్యూట్రల్స్ కూడా ఉంటారు. వాళ్లను ఎప్పుడు ఏకం చేసుకోవాలి అనేది చూసుకోవాలి. మిగితా వాళ్లు అంతా ఏకమైపోవడం వల్ల కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదు. టీడీపీ, వాళ్ల సామాజిక వర్గం పొడిచేస్తాం అని అనుకునే వాళ్లు ఒక్క బీఆర్ఎస్ సీటును కూడా ఓడించలేకపోయారు. వాళ్లు హడావుడి చేయకపోయి ఉంటే.. కాంగ్రెస్ కు మరో 4 సీట్లు వచ్చేవి. అదే ఏపీలోనూ జరగబోతోంది అంటూ కేతిరెడ్డి స్పష్టం చేశారు.

Kethireddy : ఏపీలో ఒక వర్గం ఒకవైపు.. మిగితా వర్గాలు మరోవైపు రాబోతున్నాయి

ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో అదే జరగబోతోంది. ఏపీలో ఒక వర్గం ఒకవైపు.. మిగితా వర్గాలు మరోవైపు రాబోతున్నాయి. కాంగ్రెస్ కు సిటీలో ఒక్క సీటు కూడా రాకపోవడానికి కారణం టీడీపీ బ్యాచ్ చేసిన హడావుడే. వీళ్లు లేకపోయి ఉంటే కనీసం కొన్ని సీట్లు అయినా వచ్చేవి. మిగితా చోట్ల వచ్చి సిటీలో రాకపోవడానికి వీళ్ల హడావుడే కారణం. బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ లో దళిత బంధు ఒకటి. వెల్ఫేర్ స్కీమ్స్ లో పిక్ అండ్ చూజ్ లా చూడకూడదు. అదే బీఆర్ఎస్ కు దెబ్బ తీసింది అని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది