Vijayasai Reddy : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన విజయసాయి రెడ్డి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayasai Reddy : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన విజయసాయి రెడ్డి !

 Authored By kranthi | The Telugu News | Updated on :23 June 2023,8:00 pm

Vijayasai Reddy : ఏపీలో ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయి. అవును.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారు. తాజాగా గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది కూడా ఈ యూనివర్సిటీలో జాబ్ మేళా నిర్వహించామని.. దాన్నే యూనివర్సిటీ వాళ్లు కొనసాగించడం గొప్ప విషయం అన్నారు.

మెగా జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులకు విజయసాయిరెడ్డి ధైర్యం చెప్పారు. ఇంటర్వ్యూకు సంబంధించి పలు సూచనలు, సలహాలు నిరుద్యోగులకు ఇచ్చారు. ఎలాంటి బెరుకు లేకుండా ఇంటర్వ్యూలో పాల్గొనాలని సూచించారు. ఇంటర్వ్యూ చేసే వారిని కూడా మెప్పించాలి. దాని కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటేనే ఏ రంగంలో అయినా రాణించగలం అన్నారు.ఇప్పటికే ఉమ్మడి 13 జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించామని.. మరో 9 చోట్ల కూడా త్వరలో నిర్వహిస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళాలో ఎవరైనా నిరుద్యోగులు పాల్గొనవచ్చని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Vijayasai reddy praises ys jagan for giving jobs

Vijayasai reddy praises ys jagan for giving jobs

Vijayasai Reddy : ఉమ్మడి 13 జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో జాబ్ మేళాలు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 1.75 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. జాబ్ మేళాల ద్వారా మరో 40 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని.. ఆ ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. మరో 8 నెలల్లో 50 నుంచి 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా నిరుద్యోగ సమస్య ఉండకూడదని.. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావాలనేదే సీఎం జగన్ తపన అన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది