Ysrcp : టీడీపీ జనసేన అసంతృప్తుల కోసం గాలం వేస్తున్న వైసీపీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : టీడీపీ జనసేన అసంతృప్తుల కోసం గాలం వేస్తున్న వైసీపీ…!

Ysrcp : టీడీపీ జనసేన టికెట్ల వివాదం వలసలకు దారి తీసేలా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలోకి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. మరోవైపు అసంతృప్తిగా ఉన్న నేతల కోసం వైసీపీ గాలం వేస్తుంది. ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరుతుంది. టీడీపీ జనసేన అధినేతలు స్పందించాల్సిందే అంటూ అసంతృప్తి నేతలు అల్టిమేట్ జారీ చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే టీడీపీ జనసేన ఉమ్మడి గోదావరి […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 February 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : టీడీపీ జనసేన అసంతృప్తుల కోసం గాలం వేస్తున్న వైసీపీ...!

Ysrcp : టీడీపీ జనసేన టికెట్ల వివాదం వలసలకు దారి తీసేలా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలోకి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. మరోవైపు అసంతృప్తిగా ఉన్న నేతల కోసం వైసీపీ గాలం వేస్తుంది. ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరుతుంది. టీడీపీ జనసేన అధినేతలు స్పందించాల్సిందే అంటూ అసంతృప్తి నేతలు అల్టిమేట్ జారీ చేస్తున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే టీడీపీ జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాలో అసంతృప్తుల సెగలు రగులుకుంటున్నాయి. ఎక్కడికక్కడ అంత టీడీపీ క్యాడర్ మరియు జనసేన క్యాడర్ ఇద్దరు కూడా అసంతృప్తులను వెలగెక్కుతున్నారు. అలాగే నిరసనలు కూడా ఎక్కడికక్కడ వినిపించడం జరుగుతుంది. ఇక ఎక్కడైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి వైసీపీ అధిష్టానం నుంచి వైసీపీ నేతలు వరకు తమ ప్రయత్నాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇక అంబేద్కర్ కోన సీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం లో జనసేన ఇన్ ఛార్జ్ బండర శ్రీనివాస్ కి టికెట్ లభించకపోవడంతో ఆయన కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు. దానితో క్యాడర్ మొత్తం నిన్న నిరసనలు తెలియజేశారు.

అలాగే పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాలు ఫ్లెక్సీలు పీకి వేసి ఆ తర్వాత వాటిని ధ్వంసం చేయడం జరిగింది. స్థానిక వైసిపి అభ్యర్థి మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి వెళ్లి జనసేన ఇన్ ఛార్జ్ బండర శ్రీనివాస్ ని కలవడం జరిగింది. దీనితో అక్కడ రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో ఆయనకి టికెట్ రాని కారణంగా తనకి మద్దతు ఇవ్వాలని జగ్గిరెడ్డి శ్రీనివాస్ ను కోరినట్లు సమాచారం. అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి టికెట్ ఆశించి బంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా కొద్దిరోజుల నుంచి వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలలో దూరంగా ఉంటున్నారు. అయితే చంటిబాబు క్యాడర్ మొత్తం కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారు కూడా త్వరలోనే టీడీపీ లోకి చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.

అయితే స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉండడం తో ఆయన ఆ పార్టీలో చేరడం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పాలి. అయితే టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జ్యోతుల చంటిబాబు కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో టికెట్లు ప్రకటించిన తర్వాత ఈ రకంగా అసంతృప్తులు బయటకి రావడం జరుగుతుంది. అధికార పార్టీలో కూడా కొంతమంది టిక్కెట్ ఆశించి బంగపడిన నేతలు కూడా ఇదే రకమైన అసంతృప్తితో కొనసాగడం జరుగుతుంది. మరి ఈ అసంతృప్తుల సగ అనేది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది