Business : 500 అప్పు తెచ్చుకొని స్టార్ట్ చేసిన చిన్న కొట్టు.. ఇప్పుడు నెలకి 5 కోట్ల లాభం…!
ప్రధానాంశాలు:
Business : 500 అప్పు తెచ్చుకొని స్టార్ట్ చేసిన చిన్న కొట్టు.. ఇప్పుడు నెలకి 5 కోట్ల లాభం...!
Business : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అంటారు కదా.. నిజంగా అది అక్షర సత్యం. కేవలం కష్టాన్ని నమ్ముకున్న ఓ మహిళా తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్ల సంపాదించే వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఆమె భర్త కార్ రిపేరు చేసేవాడు. కానీ ఆ వ్యాపారం కలిసి రాలేదు. దీంతో తన కుటుంబాన్ని పోషిస్తానని భర్త గోవర్ధన్ సింగ్ ఒక్కడే ఢిల్లీకి వచ్చాడు. కానీ ఏమి సంపాదించలేకపోయాడు. తన ఖర్చులకు సరిపడా కూలి మాత్రమే దొరికేది. దీంతో గ్రామంలో ఉన్న భార్య ముగ్గురు పిల్లలకు ఏమి పంపలేకపోయేవాడు. దీంతో ఇక ఇక్కడే ఉంటే బ్రతకడం కష్టమవుతుందని తన దగ్గర బంధువుల కాళ్లు పట్టుకొని ఓ 500 రూపాయలను తీసుకొని వెయ్యి రూపాయలకి ఒక రూము అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే నెలకు ₹1000 తీసుకున్నాడు. కృష్ణ యాదవ్ కు చదువులేదు. ఆమె భర్తకు కనీసం చదవడం రాయడం వచ్చు. అందుకే పిల్లలు మాత్రం చదువుకోవాలనే తపన ఇద్దరికీ ఉండేది. కృష్ణ యాదవ్ భర్త కూడా ఏదో పనికి వెళ్లేవారు. అయితే తెలిసిన వారికి దగ్గరలో కొంత భూమి ఉందని తెలిసికొని కూరగాయల పండించారు. ఆ కూరగాయల పండించి అమ్మినా కూడా తనకి పెద్దగా లాభం అనేది ఉండకపోయేది అయితే కృష్ణ యాదవ్ ఒకరోజు టీవీలో ప్రోగ్రాం చూసిఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనే వారికి ఏ ప్రభుత్వమే ప్రోత్సాహం ఇస్తుంది. ఆర్థిక సాయం కూడా చేస్తుందని అధికారుల వివరించారు.
అంతేకాదు ఏమంచి పోటీ ఉండేది ఒక్కరకమే కాదు కనిపించే నోటికి రుచిని ఇచ్చే ప్రతి కాయతో పచ్చడి చెయ్యాలి అని చెప్పేవారు. ఆ విధంగా శిక్షణ తీసుకున్న కృష్ణా యాదవ్ ఇంటికి వచ్చి ఇంట్లో ఆల్ బకరా పండు తో పచ్చడి చేసి పిల్లలకి తన భర్తకి పెట్టింది కృష్ణ యాదవ్ అది కూడా అద్భుతంగా ఉందన్నారు పిల్లలు భర్త గోవర్ధన్ కూడా చాలా టేస్ట్ గా ఉందన్నారు. ఇద్దరు పక్కింటి స్నేహితులకు కూడా రుచి చూపించారు. అందరు బాగుందన్నారు. అంతే కాదు దానికి తోడు మిరపడే పచ్చడి కూడా వెరైటీ రుచి వచ్చేలా పెట్టేసింది. రెండు పర్ఫెక్ట్ గా కుదిరాయి వాటిని మొదట కవర్స్ లో 100 గ్రాములు ప్యాక్ చేసి మెయిన్ రోడ్డు మీద భర్త పంపించేవారు. కానీ అది తక్కువ మంది కొనేవారు. కొద్ది రోజుల తర్వాత భర్తకు అనారోగ్యం వచ్చింది. దీంతో తానే ఉదయం 7 గంటలకే రోడ్డుమీద వేసుకొని స్టాల్ లాగా పెట్టింది. వాకింగ్ కి వెళ్లేవారు ఆఫీసులకు వెళ్లేవారు చూసేవారే కానీ కొనేవారు కాదు. దీంతో ఒకటి రెండు ప్యాకెట్లు మాత్రమే అమ్మేసి ఆ తర్వాత వాటిని కాలనీలో ఫ్రీగా ఇచ్చేసేది మళ్లీ అవే పచ్చళ్ళు పెట్టి రోడ్డు మీద పెట్టింది. అప్పుడే ఓ రేటెడ్ ఆఫీసర్ అటు పక్కకి వెళుతున్నారు. ఆయన రోజు కృష్ణ యాదవ్ గమనిస్తూ ఉన్నారు. ఓ రోజు ఏం పచ్చళ్ళు అని అడిగారు. ఇది ఆల్బకరా పండు పచ్చడి ఇది మిరప పచ్చడి అని చెప్పింది. కానీ అప్పుడే ఆయన మరో సలహా కూడా ఇచ్చారు. ఆ సలహాతో ఆమె మార్చేసింది. నువ్వెలా ప్లాస్టిక్ కవర్లో పెట్టి అమ్మితే ఎవరో కొనరు…
కాస్త ధర ఎక్కువగా పెట్టి నీటుగా గాజు సీసాలో పెడితే కొంటారు. రుచి లోపల ఉందని వారికి తెలియదు కదా.. ముందు శుభ్రత ఆ తర్వాత చూడడానికి బాగుంటే కొంటానని చెప్పారు. అంతేకాదు ఆయన వెళుతూ వెళుతూ మరో రెండు పచ్చడ్లు కొని వాటి గురించి మనం నలుగురికి కూడా చెప్పారు. ఆ డబ్బులతో శ్రీకృష్ణ పికల్స్ అనే స్టిక్కర్లు వేసి అమ్మేది. కానీ డబ్బులు మాత్రం సరిపోవడం లేదు. డబ్బులు సరిపోకపోవడంతో గ్రామంలో ఉన్న ఇల్లు అమ్మేసింది కృష్ణ యాదవ్ మునిగిన తేలిన ఇదే జీవితం మనకు ఉంది. పచ్చళ్ళు కూడా రుచిగా ఉంటేనే అమ్మేవారా ఆమె. కావాలంటే వేల రూపాయల ప్రొడక్ట్స్ ని కూడా ఉచితంగా కాలనీలో ఇచ్చేసేవారు. అమ్మారంటే రుచి ఉండాలని ఎంతో జాగ్రత్తగా పెట్టింది. రెండు పచ్చళ్ల నుంచి పది వెరైటీలకు పెంచారు. కృష్ణ యాదవ్ అంతే వ్యాపారం ఒక్కసారిగా పరిగెత్తింది. రుచితో పాటు శుభ్రంగా ఉండడంతో తెగ కొనేశారు జనం. అలా ఐదేళ్లపాటు రోడ్డుమీద కృష్ణ యాదవ్ ఓ చిన్న షాపును అద్దెకి తీసుకొని అమ్మడం మొదలు పెట్టింది. బాగా పేరొచ్చింది స్థానికంగా జనం అంతా మన ఇంట్లో చేసుకున్నట్లే పచ్చళ్ళు ఉన్నాయని కృష్ణ యాదవ్ స్వచ్ఛమైన కారం నుంచి మసాలాల వరకు వాడుతూ క్వాలిటీ తగ్గకుండా వ్యాపారం చేసేవారు అంతే పదేళ్ల తర్వాత ఆమె దగ్గరికి పదిమంది నుంచి 30 మంది పనిచేసిన కూడా స్టాక్ అందించలేకపోయారు.
దీంతో గొడమ్ లాంటి ప్లేస్ ని అద్దెకు తీసుకొని గవర్నమెంట్ అనుమతితో కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించి ఏకంగా రోజుకు 30 రకాల పచ్చళ్ళు పెడుతూ వచ్చారు. తర్వాత పచ్చల తయారీని తన ముగ్గురు పిల్లలకు నేర్పించి వంద రకాల పచ్చళ్ళు పెట్టి వివిధ షాపులు సూపర్ మార్కెట్లో పెట్టి అమ్మేవారు.దాని తో ఆమె జీవితమే మారిపోయింది. మరి కృష్ణ యాదవ్ స్టోరీ నుంచి ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకున్నారు. కృష్ణ యాదవ్ పచ్చడ్ల కొని తిని బాగున్నాయంటమే కాదు.. ఆఫీసర్ ఇచ్చిన సలహాతో ఆమె జీవితమే మారిపోయింది. 500 అప్పు తీసుకొని పెట్టిన కొట్టు ఇప్పుడు ఐదు కోట్ల లాభం తెచ్చిపెడుతుంది..