Business idea : అతి తక్కువ ధరకే వెజ్ ఐస్ క్రీమ్ అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా
Business idea : ఐస్ క్రీమ్ లేని ప్రపంచాన్ని ఎప్పుడైనా ఆలోచించారా..? ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరూ.. చిన్న పిల్లలకు అదంటే ప్రాణం. మరి గేదె, ఆవు పాలు లేకుండా ఐస్ క్రీం ఊహించగలమా… అదే ఆలోచన వచ్చింది. కోయం బత్తూరుకు చెందిన అరవిందన్ కు ఇదే ఆలోచన వచ్చింది. పూర్తిగా వీగన్ పద్ధతిలో ఐస్ క్రీమ్ చేయగలమా అని ఆలోచించి.. ఆరేళ్ల క్రితం ‘కొకోలీషియస్’ అనే బ్రాండ్ తీసుకొచ్చాడు. ఈ ఐస్ క్రీమ్స్ పూర్తిగా నేచురల్, వీటిలో ఎలాంటి ప్రిజర్వేటీవ్స్ లేకుండా తయారు చేశారు.
నేను, నా భార్య పెర్ల్ మిల్లెట్ మిల్క్, రాగి పాలు, కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాలను కలిపి ప్రయోగాలు చేసినప్పుడు ఈ ఐస్ క్రీములు పుట్టాయి. మేము ఆ అద్భుతమైన రుచిని చూసి ఆశ్చర్యపోయా. దీనిపై మరింత రీసెర్చ్ చేయాలని నిర్ణయించుకున్నాం.’- అరవిందన్ఈ రుచులు వీగన్, నాన్ వీగన్లను ఆకట్టుకుంటాయో లేదో అని చూడటానికి, ఈ జంట తమ జీరో-వేస్ట్,వీగన్ వెడ్డింగ్‌లో ఐస్‌క్రీమ్‌ను రుచి చూపించాలి అనుకున్నారు.మా పెళ్లికి సుమారు 1,500 మంది అతిథులు వచ్చారు. శాకాహార భోజనాలు. మేము ఐస్ క్రీమ్ కూడా పెట్టాం. అతిథులు రెండోసారి, మూడో సారి సర్వింగ్ కూడా వెళ్లారు.. దీంతో వారికి ఆ ఐస్ క్రీమ్ నచ్చిందని నాకు అర్థమైంది.
ఇది బిజినెస్ ఐడియాగా డెవలప్ చేయవచ్చని ఆలోచన వచ్చింది. కానీ దీన్ని తక్కువ ధరలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం.’- అరవిందన్ఇప్పుడు, కొకోలీషియస్ ఐస్ క్రీమ్‌లు ఒక స్కూప్‌కు రూ.50 ల సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి! అరవిందన్ వారి ప్రాంతానికి 100 కి.మీ దూరంలో లభించే కాలానుగుణ పండ్ల ఆధారంగా రుచులను అభివృద్ధి చేస్తున్నారు. కొబ్బరి పాలు , బాదం పాలతో ఈ ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ లు తయారు చేస్తున్నారు. నెలకు 1,000 కిలోల బ్యాచ్‌లలో తయారు చేస్తూ.. వ్యాపారాన్ని విజయవంతంగా, ఆరోగ్యంగా నడుపుతున్నారు అరవిందన్..