Business Idea : తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం .. ఇంతకంటే బెస్ట్ బిజినెస్ మరొకటి ఉండదు ..!!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎటువంటి బిజినెస్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. అలాంటి వారికి ఈ బిజినెస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బిజినెస్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. అదే అరటికాయ పొడి వ్యాపారం. ఈ వ్యాపారంలో ఎక్కువ ఖర్చు ఉండదు. 10వేలు, 15 వేల రూపాయలతోనే అరటి పొడి వ్యాపారం చేయవచ్చు. అయితే ఈ పొడి తయారు చేయడానికి యంత్రాలు అవసరం ఉంటుంది. ఈ యంత్రాన్ని ఆన్లైన్లో లేదా సమీపంలో ఏదైనా దుకాణం నుంచి కొనుగోలు చేయవచ్చు. అరటికాయ పొడి చేయడానికి ముందుగా పచ్చి అరటి పండ్లను సేకరించాలి.
తర్వాత ఈ అరటిని సోడియం హైపోక్లోరైడ్ తో శుభ్రం చేయాలి. వాటి తొక్క తీసేసి వెంటనే సిట్రిక్ యాసిడ్ ద్రావణంలో వేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒవేన్ లో 60 డిగ్రీల సెల్సియస్ వద్ద 24 గంటలు ఉంచాలి. తర్వాత అరటిపండు ముక్కలు పూర్తిగా ఆరిపోతాయి. తర్వాత వాటిలో మిక్సీలో వేసి మెత్తగా పొడి వచ్చేవరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ వ్యాపారానికి ఎక్కువ పెట్టుబడి ఉండదు. ఖర్చు దాదాపుగా 10 – 15 వేల రూపాయల వరకు ఉంటుంది. కానీ సంపాదన మాత్రం మంచిగా ఉంటుంది. అరటి పండుతో చేసిన పొడిని పాలిథిన్ లేదా గాజు సీసాలో నింపి ఉంచుకోవాలి.
అరటి పండుతో తయారుచేసిన కేజీ పొడిని మార్కెట్లో 800 నుంచి 1000 వరకు ఈజీగా అమ్మవచ్చు. రోజు 5 కిలోల అరటిపండు పొడి చేసి అమ్మితే 3500 నుంచి 4500 వరకు లాభం పొందవచ్చు. అరటిపొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణశక్తిని బలోపేతం చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అందుకే మార్కెట్లో ఈ అరటి పొడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.