Business Idea : ఈ పండును సాగు చేసారంటే. ఎకరానికి అరకోటి ఆదాయం వస్తుంది.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Idea : ఈ పండును సాగు చేసారంటే. ఎకరానికి అరకోటి ఆదాయం వస్తుంది.!

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,12:40 pm

Business Idea : మన దేశంలో రైతులు సాంప్రదాయ పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ సాంప్రదాయ పంటల వలన చాలామంది నష్టాల పాలవుతున్నారు. అలాంటి రైతులు డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేస్తే లక్షల్లో ఆదాయం పొందవచ్చు. రైతులు వ్యవసాయం చేయడం ద్వారా ధనవంతులు కావచ్చు. ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ ను కనుక సాగు చేస్తే సులువుగా ధనవంతులు అవ్వచ్చు. ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను ఎక్కువగా మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మరియు వియత్నాంలలో పండిస్తారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ డ్రాగన్ ఫ్రూట్ ను పెంచినట్లయితే బంపర్ ఆదాయాలు పొందవచ్చు. ఎకరం భూమిలో ఈ డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేసినట్లయితే సంవత్సరానికి మిలియన్ డాలర్లు సంపాదించవచ్చు.

తొలిదశలో ఈ పంట సాగుకు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.ఈ డ్రాగన్ ఫ్రూట్ పంట సీజన్లో కనీసం మూడుసార్లు పండ్లను ఇస్తుంది. ఒక్కొక్క పండు సాధారణంగా 400 గ్రాముల వరకు ఉంటుంది. ఒక్కో చెట్టు కనీసం 50-60 పండ్లను ఇస్తుంది. మన భారతదేశంలో డ్రాగన్ ఫ్రూట్ కి మంచి గిరాకీ నే ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ధర కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ పండును కనుక సాగు చేశారంటే లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ప్రతి చెట్టు నుండి కనీసం 5000 రూపాయల వరకు సంపాదించవచ్చు.ఒక ఎకరం భూమిలో కనీసం 1700 డ్రాగన్ ఫ్రూట్ చెట్లను నాటవచ్చు. అంటే ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తే సంవత్సరానికి దాదాపుగా 70 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.

Business Idea Farmers cropping these dragon fruit get crores

Business Idea Farmers cropping these dragon fruit get crores

ఈ మొక్కను నాటిన తర్వాత మొదటి సంవత్సరం నుంచి డ్రాగన్ ఫ్రూట్ యొక్క పండ్లను పొందడం ప్రారంభిస్తారు. ఈ పండు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా పండుతుంది. అలాగే నేల నాణ్యత సరిగ్గా లేకపోయినా ఈ డ్రాగన్ ఫ్రూట్ బాగా పెరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ను 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సులువుగా పెంచవచ్చు. దీని సాగుకు ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేయాలనుకుంటే మీ నేల పిహెచ్ 5.5 నుండి 7 వరకు ఉండాలి. దీనిని ఇసుక నేలలో కూడా పెంచవచ్చు. మంచి సేంద్రియ పదార్థం మరియు ఇసుక నేలలో దీనిని సాగు చేయవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ ను జాములు, ఐస్ క్రీమ్, జెల్లి ఉత్పత్తి, పండ్ల రసం, వైన్ మొదలైన వాటిల్లో ఉపయోగిస్తారు. అలాగే ఈ ఫ్రూట్ ను ఫేస్ ప్యాక్ లో కూడా ఉపయోగిస్తారు. ఈ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది