Business Idea : ఈ పంట ను పండిస్తే .. నెలకు లక్షల ఆదాయం గ్యారెంటీ…!
Business Idea : ప్రస్తుతం సొంత వ్యాపారం చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే వ్యవసాయం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. కాకపోతే సాంప్రదాయం వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా రైతులు అశ్వగంధ చెట్టు సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. అశ్వగంధ మొక్క నుండి పండ్లు, గింజలు మరియు బెరడు వివిధ రకాల ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అన్ని మూలికలలో అశ్వగంధ ఎంతో ప్రసిద్ధమైనది. ఆధునిక సాంకేతికత ద్వారా ఈ పంట సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఈ అశ్వగంధ గింజలు నాటడానికి ఆగస్టు నెల సరైనది.
ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాలలో వర్షపాతం తగ్గాక సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఈ మొక్కను నాటుతారు.మరొక పంట కలబంద సాగు. ఒక కలబంద మొక్క నుండి ఐదు కిలోల ఆకులను పొందవచ్చు. ఒక ఆకు ధర 5 నుండి 6 రూపాయల వరకు ఉంటుంది. ఇక సగటున ఒక్కో మొక్కకు 18 రూపాయల వరకు అమ్మవచ్చు. ఇక 40 వేలు పెట్టుబడి పెట్టి రెండున్నర లక్షల దాకా ఆదాయం పొందవచ్చు. కలబందకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కలబందను వైద్య మరియు సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. దీంతో రైతులు మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం పుట్టగొడుగులకు డిమాండ్ ఎక్కువ ఉంది.
దానికి డిమాండ్ ఉంది కానీ పుట్టగొడుగుల ఉత్పత్తి జరగడం లేదు. వీటిని కనుక సాగు చేశారంటే మంచి లాభాలను పొందవచ్చు. బట్టర్ మష్రూమ్, ఓస్టర్ మష్రూమ్, రైస్ మష్రూమ్ మూడు ప్రధాన రకాల సాగు కోసం ఉపయోగిస్తారు. ఓస్టర్ పుట్టగొడుగులను ఉత్తర మైదానాలలో పెంచుతారు. బటర్ పుట్టగొడుగులను ఏ సీజన్లో అయిన పెంచవచ్చు. అలాగే ఎర్రచందనం సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. దీంతో కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు. అయితే గంధపు చెక్కల పెంపకానికి అటవీ శాఖ అనుమతి అవసరం. గంధాన్ని పతపరమైన అవసరాలకు ఉపయోగిస్తారు. ఇది ఔషధం మరియు పరిమళ ద్రవ్యాల తయారీకి కూడా ఉపయోగిస్తారు.