Business idea : చాయ్ బండి పెట్టి లక్షలు సంపాదిస్తున్న మహిళ..
Business idea : ‘నీకు సంతోషాన్నిచ్చే.. పని గర్వంతో చేయాలి, సిగ్గుతో కాదు. మీరు చిన్న పని నుంచి కూడా మంచి డబ్బు సంపాదించవచ్చు. ఏ పని చిన్నది కాదు‘ ఇది రాజ్‌కోట్‌కు చెందిన నిషా హుస్సేన్ (28) రహస్యం.తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజ్‌కోట్ ఫేమస్ ‘ఛాయ్ వాలీ‘ నిషా హుస్సేన్ ట్రిక్స్ నేర్చుకోవడానికి టీ కేఫ్‌లో పనిచేసింది. ఇప్పుడు ఆమె ఒక్క చేతితోనే ‘ది చైలాండ్‘ సస్కెస్ ఫుల్గా నడుపుతోంది. అందరూ ఇష్టపడే.. తందూరీ టీతో సహా 10 రకాల టీలను అమ్ముతోంది.తను టీ వ్యాపారం చేయడం నిషా ఇంటి వారికి ఇష్టం లేకపోయినా.. నిషా 2017లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. రహస్యంగా టీ అమ్మడం ప్రారంభించింది.’నాకు చిన్నప్పటి నుంచి ప్రత్యేక సందర్భాలలో టీ చేయడం చాలా ఇష్టం.
నేను నా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, నేను విజయం సాధిస్తానని నమ్మకం ఉంది. కానీ మొదట్లో కస్టమర్‌లు ఎవరూ లేరు. టీ స్టాల్‌ను ఒంటరిగా నడుపుతున్న స్త్రీని చూడటం ప్రజలకు అలవాటు లేదు, నా దగ్గరికి రావడానికి భయపడేవారు. నేను కనీసం 15 రోజుల పాటు నా టీని చాలా వరకు పారబోసాను.’ ”నిషా‘ఒక రోజు, ఒక కస్టమర్ నా స్టాల్ గురించి ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. అది వైరల్‌గా మారింది. ఆ తర్వాత ‘ది చైలాండ్‘ కు జనం పోటెత్తారు. జనం నన్ను ‘రాజ్‌కోట్ చాయ్వాలీ‘ అని పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది.’”నిషా‘నేను గత సంవత్సరం వరకు ప్రతి నెలా కనీసం రూ. 50,000 సంపాదిస్తున్నాను,
కానీ లాక్‌డౌన్‌ల సమయంలో నా టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు భారీ నష్టాలను చవిచూశాను. నేను పెద్ద కస్టమర్ బేస్‌ను సంపాదించాలనే ఆశతో జూన్‌లో నా కేఫ్‌ని తెరిచాను, కానీ అది అంత బాగా నడవలేదు. ప్రస్తుతానికి, నా స్టాల్‌లో వ్యాపారం సజావుగా సాగేలా చూడాలనుకుంటున్నాను. రాజ్‌కోట్ ప్రజలు నాకు చాలా ప్రేమను అందించారు, ఇది నా వ్యాపారానికి శక్తిని ఇచ్చింది. చాలా మంది తమ పిల్లలను కూడా నన్ను కలవడానికి తీసుకువస్తారు, నా విజయాన్ని వారికి చెప్తారు. నాకు చాలా గర్వంగా ఉంటుంది‘.”నిషా