Business idea : పనికిరాని స్మార్ట్ ఫోన్లను బాగు చేసి.. తక్కువ ధరకు అమ్ముతూ లక్షలు సంపాదిస్తున్నారు.. ఎక్కడో తెలుసా?
Business idea : సెల్ ఫోన్లు ఎక్కువగా వాడే ప్రతి ఒక్కరికీ.. ఐ ఫోన్ ఒక కల. ఎప్పటికైనా ఐ ఫోన్ కొనాలనే కోరిక ఉంటింది. కానీ దాన్ని కొనేంత.. స్తోమత ఉండదు.. కానీ అహ్మదాబాద్ ఆదారితి స్టార్టప్.. మీ ఐ ఫోన్ కల నెరవేరుస్తామని ముందుకు వస్తోంది. రీఫర్బిష్డ్ ఫోన్ ను.. అందుబాటు ధరల్లో.. అదీ వరంటీతో ఇస్తామని హామీ ఇస్తోంది. దీని ద్వారా పర్యావరణానికీ మంచిదని అంటోంది మొబెక్స్.. స్టార్టప్..క్రునాల్ షా, రుణ్ హట్టంగడి ఖర్మటెక్.. అనే సంస్థను 2011లో ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులు, పునరుద్ధరణకు ఈ వ్యాపారం మొదలుపెట్టారు. ఇది బిజినెస్ టూ బిజినెస్ (B2B) సెగ్మెంట్‌పై దృష్టి పెట్టేవారు.. 2020 లో కస్టమర్లకు అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లు అందించడానికి మొబెక్స్ .. పేరుతో సంస్థ ప్రారంభించారు. ఇది బిజినెస్ టూ కస్టమర్ (B2C) అనే కన్సెప్ట్ లో ప్రారంభించారు.
ఐ ఫోన్, ఒన్ ప్లస్, సామ్ సంగ్ లాంటి కాస్ట్లీ ఫోన్లకు అప్ గ్రేడ్ అయ్యేవాళ్లు కస్టమర్లే మొబెక్స్ లక్ష్యమని ఫౌండర్ కునాల్ అన్నారు. కానీ ఆ ఫోన్లపై అంత ఖర్చు చేయలేని వారిపై మొబెక్స్ దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి మొబెక్స్ స్మార్ట్‌ఫోన్‌లు గుజరాత్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో బెంగళూరు మార్కెట్‌లోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, ఎన్సీఆరా, తెలంగాణ ప్రాంతాల్లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొబెక్స్ ఉత్పత్తులు ఆన్‌లైన్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్లో కూడా మొబక్స్ ఫోన్లు దొరుకుతాయి.మొబెక్స్ టైర్-II నగరాల్లోనూ.. విస్తరించడానికి యోచిస్తున్నామని కునాల్ అంటున్నారు.
దీంతో.. వారి మొబైల్ల.. ఏఎస్పీ (యావరేజ్ సెల్లింగ్ ప్రైస్) రూ. 15,000-16,000కి తగ్గుతుందని చెప్పారు. ఈ ఏడాది ఒక నెలలో ..15,000-20,000 పునరుద్ధరించిన స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకన్నట్లు తెలిపారు. తక్కువ ధరతో.. అధికా నాణ్యత ఉత్పత్తిని అందించడమే.. మొబెక్స్ బలమని ధీమా వ్యక్తం చేశారు. మొదట పవర్ అడాప్టర్లు రిపేర్ చేసే ఐదుగురు వ్యక్తులతో కంపెనీ ప్రారంభమైంది. . ప్రస్తుతం 850 మంది ఉద్యోగులు నెలకు రెండు లక్షలకు పైగా ఎలక్ట్రానిక్స్‌ను రిపేర్ చేస్తున్నారు. ఖర్మా టెక్ బీ టూ బీ, బీ టూ సీ విభాగాలు.. రెండింటిలోనూ తన ఉనికిని కొనసాగిస్తుంది. వివిధ కంపెనీల కోసం అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను రిపేర్ చేస్తూనే.. మొబైల్ రంగంలో తన ఉనికిని చాటాలనుకుంతోంది.