Business Idea : మహిళలకు చక్కని అవకాశం.. రోజుకి 4 గంటలు కష్టపడితే చాలు నెలకు 60,000 రూ.

Advertisement

Business Idea : సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి మనదేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ పెట్టుబడి లేకుండా సంపాదించడానికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాలలో ఉత్తమమైనది టీ కాఫీల కప్పులు వ్యాపారం. ఈరోజుల్లో టీ, కాఫీలు బాగా సాగుతున్నాయి. వీటికి ఉపయోగించే పేపర్ కప్పు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పేపర్ కప్ కూడా బిజినెస్ లిస్టులో చేరింది. మనదేశంలో ప్లాస్టిక్ వాడకం నిషేధించారు. ఇప్పుడు ఏ షాప్ లోను ప్లాస్టిక్ దొరకడం లేదు. టీ తాగేందుకు స్టీల్ కప్పులు, పేపర్ కప్పులు వాడుతున్నారు. హోటళ్లలో పేపర్ కప్పులకు మంచి గిరాకీ ఉంది. ఈ పేపర్ కప్ తయారీ వ్యాపారంతో నెలకు 60 వేల వరకు సంపాదించవచ్చు. పేపర్ కప్పులను ఒక ప్రత్యేక కాగితం ద్వారా తయారు చేస్తారు. వీటిని వివిధ రకాల సైజులలో తయారు చేస్తారు. అలాగే పేపర్ కప్పులు పర్యావరణానికి అనుకూలమైనవి. కాబట్టి వీటిని వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.

Advertisement

ఈ వ్యాపారానికి చిన్నగా ప్రారంభించాలనుకుంటే మీరు ఒకటి నుండి లక్షన్నర రూపాయలలో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇందుకోసం మార్కెట్లో అనేక రకాల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మిషనరీ పేపర్ కప్ ప్రేమింగ్ మిషన్ ధర 5 లక్షలు ఉంటుంది. ఆఫీస్ సామాగ్రి ధర దాదాపు 50 వేలు ఉంటుంది. ముడి పదార్థం కప్పు చేయడానికి దాదాపుగా 90 కిలోల పేపర్ రీల్ అవసరం. దీనికి అదనంగా 78 కిలోల కోసం కొనుగోలు చేయగల దిగువ రీల్ అవసరం.ఈ పేపర్ కప్పులను తయారు చేయడానికి యంత్రాలు ఎంతో అవసరం. ఇవి ఢిల్లీ, హైదరాబాద్, ఆగ్రా, అహ్మదాబాద్ అనేక నగరాలలో లభిస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో ఈ మిషన్లను కొనుగోలు చేసుకోవచ్చు. మీరు ఉన్న ప్రాంతానికి మిషన్లను డెలివరీ చేస్తారు. పేపర్ కప్పుల తయారీకి ముడిసరుకు కూడా ఇక్కడినుంచే పొందవచ్చు.

Advertisement
Business Idea New Business of Paper Cups
Business Idea New Business of Paper Cups

కాగితపు కప్పులను తక్కువ సైజులో తయారుచేసి స్థానిక మార్కెట్లో అమ్మాలనుకుంటే మీరు ఇంట్లో చిన్న యంత్రాన్ని అమర్చడం ద్వారా ప్రారంభించవచ్చు. పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ వ్యాపారాన్ని ఉద్యోగ్ ఆధార్ నమోదు కింద నమోదు చేసుకోవాలి. దీంతోపాటు ట్రేడ్ లైసెన్స్, కంపెనీ కరెంట్ అకౌంట్, పాన్ కార్డు వంటివి కూడా అవసరం. ముద్ర లోన్ కూడా ఉంటుంది. ఈ మిషన్ ద్వారా ఒక్క నిమిషంలో దాదాపుగా 50 కప్పులు తయారవుతాయి. కర్మాగారం రోజుకు రెండు షిఫ్టుల్లో 26 పని దినాలు పనిచేస్తే ఇక్కడ నెలలో 15 లక్షల అరవై వేల కప్పులు తయారవుతాయి. 30 పైసలు కు అమ్మిన లాభం దాదాపు నాలుగు లక్షల అరవై ఎనిమిది వేలు వస్తుంది. అన్ని ఖర్చులు పోను 60,000 మిగులుతాయి.

Advertisement
Advertisement