Business Idea : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. మోడీ అందించే 3 లక్షల రూపాయలతో సొంత వ్యాపారం చేయండి ఇలా..!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సొంత వ్యాపారం చేయడానికి మన దేశంలో చాలా బిజినెస్ లు ఉన్నాయి. కాని చాలామంది ఎటువంటి వ్యాపారం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. మరికొందరు పెట్టుబడి పెట్టే స్తోమత లేక వదిలేసుకుంటారు. అలాంటి వారికి మోడీ ప్రభుత్వం ఏదైనా బిజినెస్ చేయడానికి పెట్టుబడిగా మూడు లక్షల రూపాయలను అందజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన పథకం ద్వారా నిరుద్యోగులకు వ్యాపారం చేసుకునేందుకు రుణాలను అందజేస్తుంది. ముద్ర యోజన పథకం కింద 50,000 నుంచి 10 లక్షల దాకా రుణాలను పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం చాలామంది మినరల్ వాటర్ త్రాగటానికి ఇష్టపడుతున్నారు. మీరు కనుక సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటే వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి మంచి లాభాలను పొందవచ్చు. శుద్ధమైన వాటర్ అందించడం ద్వారా నెలకు లక్షల ఆదాయం పొందవచ్చు. దీనికోసం క్వాలిటీ గల మినరల్ వాటర్ మిషన్ కొనుగోలు చేయాలి. ఈ మిషన్ నార్మల్ వాటర్ నీ శుద్ధి చేసి ఆర్ ఓ వాటర్ గా మారుస్తుంది. ఈ యంత్రం ధర 50 నుండి లక్ష రూపాయల దాకా ఉంటుంది. ఈ యంత్రంతో భూగర్భం నుండి సేకరించిన నీటిని శుద్ధి చేయవచ్చు. శుద్ధి చేసిన నీటిని వాటర్ క్యాన్లలో నింపి విక్రయించవచ్చు. భూగర్భ జలాలకు బదులుగా నది లేదా కాలువలనుండి నీటిని సేకరించి శుద్ధి చేయవచ్చు. దీనికి నది సమీపంలో ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవాలి.
పెద్ద ఎత్తున బిజినెస్ చేయడానికి ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకోవాలి. నీటి వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా ఐఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి. ఇది నీటి నాణ్యతను నిర్ధారిస్తుంది. హోల్ సేల్ బిజినెస్ చేయాలనుకుంటే నీటిని మరింత సరఫరా చేయాల్సి ఉంటుంది. వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి మీ ఉత్పత్తి గురించి ప్రజలకు తెలిసేలా ప్రకటనలు ఇవ్వవచ్చు. మీ కంపెనీని ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లోనైనా మరింతగా ప్రచారం చేసుకోవచ్చు. దీంతో మీ వ్యాపారం గురించి అందరికీ తెలుస్తుంది. దీంతో లాభాలు కూడా పెరుగుతాయి. వాటర్ క్యాన్ 10 నుంచి 20 రూపాయల దాకా అమ్మితే నెలకు లక్షల ఆదాయాన్ని పొందవచ్చు.