Business Idea : సమోసా తయారీ బిజినెస్… ఖర్చు తక్కువ లాభం ఎక్కువ…!
Business Idea : ఎవరైనా సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటే సమోసా తయారీ బిజినెస్ చేశారంటే మంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ బిజినెస్ కి ఖర్చు తక్కువగా లాభం ఎక్కువగా ఉంటుంది. సమోసా తయారు చేసే మిషన్ కొనుగోలు చేసి సమోసాలను విక్రయించామంటే అధిక ఆదాయాన్ని పొందవచ్చు. సమోసా ఆటోమేటిక్ మిషన్ ఒక లక్ష 20000 జీఎస్టి లభిస్తుంది. డెలివరీ చార్జెస్ కూడా అదనంగా ఉంటాయి. ఈ మిషన్ ఒక సంవత్సరం వ్యారంటీ ఉంటుంది. ఈ మిషన్ ఒక గంటకు 4000 సమోసాలు కూడా తయారు చేస్తుంది. మాన్యువల్గా చేసుకుంటే గంట పడుతుంది…..
ఈ మిషన్లో సమోసా 1ఎంఎం సైజ్ లో మందంగా ఉంటుంది.3 సెం.మీ నుంచి 8 సెం.మీ వరకు సైజ్ ఉంటుంది. అదే సైజు కాకుండా మీకు నచ్చిన సైజు కావాలంటే మెషన్లో మోటర్ని సెట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అది మీరు చెబితే వాళ్ళు తయారుచేసి ఇస్తారు. ఈ మిషన్ డోర్ డెలివరీ కూడా చేస్తారు. ఇక రెండో మిషన్ ఏంటంటే 2,20,000 జిఎస్టి ధరకు లభిస్తుంది. మొదటి మిషన్ తో పోలిస్తే ఈ రెండో మిషన్ గంటకి పదివేల సమోసాలను తయారుచేస్తుంది. మసాలా అనేది మ్యానువల్ గా ఒక గంట తయారు చేయడానికి పడుతుంది. సమోసా సైజు 1 ఎంఎం మందంగా, 3 సె.మీ నుంచి 12 సెం.మీ సైజ్ లో ఉంటుంది.

Business Idea on Samosa Manufacturing Business
ఈ మిషన్ల ను థాయిలాండ్ లో తయారవుతాయి. మనకు అక్కడి నుంచి వస్తాయి కాబట్టి మీరు కనుక ఆర్డర్ చేస్తే వారంలోపు వస్తుంది. డెలివరీ ఛార్జిలు పడతాయి. ఈ మిషన్ల ధర ఎక్కువైంది అనుకుంటే తక్కువ ధరలో కూడా మిషన్లు ఉన్నాయి. ఫామీ కంపెనీ నుంచి మాన్యువల్ గా తయారు చేసుకునేవి కూడా ఉన్నాయి. అవి 16,000 ధరలో కూడా దొరుకుతాయి. మీరు కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మాన్యువల్ గా ఎలా చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుపుతారు. మీ బడ్జెట్ ధరలో మిషన్ కనుక కొనుగోలు చేసి సమోసా తయారీ మొదలుపెట్టారంటే సంవత్సరంలోనే పెట్టుబడి అంతా అయిపోయి ఇంకా కొద్దిగా మిగులుతుంది.