Business idea : గిఫ్ట్ లను హోమ్ డెలివరీ చేసే బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్న 25 ఏళ్ల యువతి.. ఎలా సాధ్యమైందో తెలుసా?
Business idea : అవసరమే ఆవిష్కరణకు అమ్మ వంటిది. నెసెస్సిటి ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు పెద్దలు. మన అవసరాలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి పునాది అవుతాయి. ఒక్కో సారి ఆ అవసరాలే వ్యాపారాన్ని సంపాదించడానికి కూడా కారణాలు అవుతాయి. అలాంటి ఉదాహరణలు మనం చాలానే చూసి ఉంటాం. ప్రస్తుతం ఉన్న చాలా వ్యాపారాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలు ఈ కోవలోకి వస్తాయి.అలాంటి ఒక అవసరమే 25 ఏళ్ల యువతిని వ్యాపారవేత్తను చేసింది. ఎవరికి రాని ఆ ఐడియాతో బిజినెస్ స్టార్ట్ చేసి… అందరి మన్ననలు అందుకుంటోంది. ప్రజలు తమ స్నేహితులు మరియు బంధువుల కోసం బహుమతులు కొనడానికి కష్టపడుతున్నట్లు గుర్తించింది ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి MBA గ్రాడ్యుయేట్ అయిన 25 ఏళ్ల సమర్ షాల్. ఈ సమస్యను తాను కూడా చాలా సార్లు ఎదుర్కొంది.
అందుబాటు ధరలో గిఫ్ట్ కొనడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ దొరికినా… దానిని ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయడం, దానిని ఇతరులకు చేరవేయడం అనేది మరింత కష్టంగా ఉండటం స్వయంగా అనుభవించింది సమర్. ఈ విషయంలో తాను ఏదో చేయాలని తలంచింది. ఈ సమస్యను తీర్చడానికి తానే స్వయంగా బిజినెస్ ప్రారంభించాలనుకుని ముందడుగు వేసింది. ‘రిబ్బన్స్’ పేరుతో గిఫ్ట్ హ్యాంపర్ సర్వీస్ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. ఇది ఆన్‌లైన్ వెంచర్, ఇక్కడ ఆమె కస్టమర్‌ల అవసరాల ఆధారంగా బహుమతులను కొనుగోలు చేస్తుంది, ప్యాక్ చేస్తుంది మరియు డెలివరీ చేస్తుంది. తన బిజినెస్ మొత్తం బడ్జెట్ ఆధారంగానే సాగుతుందని సమర్ చెబుతోంది తనను సంప్రదించే కస్టమర్ల నుంచి వివరాలు సేకరిస్తుంది మొదట. సందర్భం, ఇతర ముఖ్యమైన విషయాల గురించి అడిగిన తర్వాత…
అందుకు అనుగుణంగా కస్టమర్లకు వివిధ రకాల కాంబోలను సూచిస్తుంది. వాళ్లు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్న కార్యక్రమానికి, బడ్జెట్ కు అనుగుణంగా ఈ సూచనలు ఉంటాయని అంటోంది సమర్. సమర్ ప్రారంభించిన ఈ వ్యాపారం.. కరోనా సంక్షోభంలోనూ చక్కగా నడిచింది. అందరి జీవితాలను ప్రభావితం చేసిన మహమ్మారి… తన బిజినెస్ మరింత ఎదిగేందుకు ఉపయోగపడిందని చెబుతోంది సమర్. గిఫ్ట్ హాంపర్ అవుట్‌లెట్‌లో మూడు విభిన్న కేటగిరీలు ఉన్నాయి-బేసిక్ గిఫ్ట్ ర్యాప్, ప్రీమియం గిఫ్ట్ ర్యాప్ మరియు ఎలైట్ గిఫ్ట్ ర్యాప్, ట్రౌసో ప్యాకింగ్ మరియు స్టేజ్ డెకరేషన్. సమర్ ఆలోచనలకు వినియోగదారుల నుంచి గణనీయమైన స్పందన వచ్చిన తర్వాత, తన సేవలను విస్తరించుకుంటూ పోయాయని అంటోంది సమర్. కేవలం గిఫ్ట్‌లనే పంపకుండా.. కశ్మీర్‌లో దొరికే పండ్లను, ఖర్జ