Business Idea : నెలకు లక్ష రూపాయల ఆదాయం కావాలా… అయితే ఈజీగా ఉండే ఈ బిజినెస్ చేయండి…
Business Idea : ఈరోజుల్లో చాలామంది సొంత వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. అలాంటి వారు చేయడానికి ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. అందులో ఒకటే స్టేషనరీ వ్యాపారం. చక్కటి డిమాండ్ ఉన్న స్టేషనరీ వ్యాపారాన్ని ప్రారంభించడం వలన డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు. ఇప్పుడు స్కూల్స్ ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా కరోనా తగ్గిన తర్వాత పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్న ప్రాంతాల్లో ఈ స్టేషనరీ వ్యాపారానికి బాగా డిమాండ్ ఉంటుంది. వేసవి సెలవులు అయిపోగానే స్టేషనరీ వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. స్కూల్స్ ఉన్నన్ని రోజులు స్టేషనరీ వ్యాపారానికి ఎటువంటి లోటు ఉండదు. ఆ సమయంలో మంచి ఆదాయాన్ని రాబట్టుకోవచ్చు.
పెన్నులుల పెన్సిల్స్, A4 సైజ్ పేపర్లు మొదలైన స్టేషనరీ వస్తువులకు ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే వీటితోపాటు గ్రీటింగ్ కార్డ్స్, ఫాన్సీ కార్డ్స్, గిఫ్ట్ కార్డ్స్ లాంటివి షాప్ లో పెట్టుకోవచ్చు. అలాగే పిల్లల ఆట వస్తువులు, జిరాక్స్ మిషన్ లాంటివి పెట్టుకోవడం వలన అదనపు డబ్బును సంపాదించవచ్చు. స్టేషనరీ దుకాణాన్ని తెరవడానికి దాదాపుగా 400 చదరపు మీటర్ల స్థలం కావాలి. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఈ దుకాణాన్ని షాప్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. మంచి స్టేషనరీ దుకాణాన్ని తెరవడానికి మీకు దాదాపుగా 50వేల రూపాయలు అవసరం. ఈ బడ్జెట్ ప్రకారం. పెట్టుబడి పెట్టుకోవచ్చు అవసరమైతే జిరాక్స్ మిషన్ కూడా పెట్టుకోవడం మంచిది. దీని ధర సామర్థ్యాన్ని బట్టి 60 వేల నుంచి 85 వేల వరకు ఉంటుంది.
అలాగే కంప్యూటర్ కూడా ఏర్పాటు చేసుకోని ఇంటర్నెట్ ద్వారా డిటిపి వర్క్స్, ఆన్లైన్ వర్క్స్ చేసుకోవచ్చు. అలాగే లామినేషన్ మిషన్ ద్వారా ఐడి కార్డులు, ఇతర డాక్యుమెంట్లను లామినేట్ చేయవచ్చు. అధిక లాభాలు రావాలంటే స్టేషనరీ దుకాణాన్ని స్కూల్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, కాలేజీలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేసుకోవాలి. అలాగే హోమ్ డెలివరీ సౌకర్యాలు అందిస్తే మరింత త్వరగా షాప్ డెవలప్ అవుతుంది. స్టేషనరీ షాప్ లో బ్రాండెడ్ ఉత్పత్తిని అమ్మడం ద్వారా మీరు 30 నుండి 40% వరకు సంపాదించవచ్చు. బ్రాండెడ్ వస్తువులు అమ్మితే కస్టమర్స్ కూడా పెరుగుతారు. దీని వలన మీ ఆదాయం కూడా పెరుగుతుంది. స్టేషనరీ దుకాణాన్ని 50 వేల నుంచి 2 లక్షల పెట్టుబడితో తెరిస్తే నెలకి 20వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.