Business idea : సరికొత్త జొలొకియా టీ తయారు చేసి.. లక్షలు సంపాదిస్తున్న అస్సాం జంట.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business idea : సరికొత్త జొలొకియా టీ తయారు చేసి.. లక్షలు సంపాదిస్తున్న అస్సాం జంట..

Business idea : మీ రోజును కాస్త ‘స్పైసీ’గా ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే రంజిత్‌ బారువా అందిస్తున్న వెరైటీ టీ తాగాల్సిందే. అది సాదా సీదా టీ కాదండోయ్‌… ఘాటైన మిర్చితో చేసిన స్పైసీ టీ. ఒకప్పుడు అస్సా రాష్ట్రంలో పండే మిర్చి రకాల్లో రారాజుగా వెలుగొందిన ‘భూత్‌ జొలోకియా’ చిల్లీతో రంజిత్ బారువా, డాలీ శర్మ బారువా దీన్ని తయారుచేస్తారు. ఈ టీ టేస్టు టీ ప్రియుల మనసులను దోచుకుంటోంది.దేశంలో సాధారణ చిల్లీతో చాయ్‌ చేయడం, తాగడం […]

 Authored By jyothi | The Telugu News | Updated on :14 February 2022,8:20 am

Business idea : మీ రోజును కాస్త ‘స్పైసీ’గా ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే రంజిత్‌ బారువా అందిస్తున్న వెరైటీ టీ తాగాల్సిందే. అది సాదా సీదా టీ కాదండోయ్‌… ఘాటైన మిర్చితో చేసిన స్పైసీ టీ. ఒకప్పుడు అస్సా రాష్ట్రంలో పండే మిర్చి రకాల్లో రారాజుగా వెలుగొందిన ‘భూత్‌ జొలోకియా’ చిల్లీతో రంజిత్ బారువా, డాలీ శర్మ బారువా దీన్ని తయారుచేస్తారు. ఈ టీ టేస్టు టీ ప్రియుల మనసులను దోచుకుంటోంది.దేశంలో సాధారణ చిల్లీతో చాయ్‌ చేయడం, తాగడం చూస్తాం కానీ ఇంత ఘాటైన మిర్చితో టీ తయారుచేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి’ అంటున్నారు బారువా. ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చిగా భూత్‌ జొలోకియా (కాప్సికమ్‌ చైనీస్‌) 2013లో గిన్ని్‌సబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

ఆ తర్వాత ఈ మిర్చిని అమెరికాలో పండే కరొలినా-రీపర్‌ అధిగమించింది. భూత్‌ జొలోకియా చిల్లీ ఈశాన్యంలో ముఖ్యంగా అస్సాం, నాగాలాండ్‌, మణిపూర్‌లలో ఎక్కువగా దొరుకుతుంది.భూత్‌ జొలోకియాలో యాంటీ-బాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. యాంటీ-డయాబెటిక్‌ సుగుణాలు సైతం వీటిల్లో పుష్కలం. సాధారణ మిర్చిలో విటమిన్‌-సి ఉంటుంది. ‘అరోమికా ఫైరీ టీ’ లోని విశేష రుచి, సువాసనలు ఇంకా ఇంకా తాగాలనిపించేలా నోరూరిస్తాయిట. ఈ టీ ప్రత్యేకత అదేనట. భూత్‌ జొలోకియాని ‘ఘోస్ట్‌ పెప్పర్‌’ అని కూడా అంటారు. ‘దేకి’ అనే వెదురు పనిముట్టులో చేసిన ఆర్గానిక్‌ బ్లాక్‌ టీతో దీన్ని కలుపుతారు. సరైన బ్లెండుతో ఈ టీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడానికి నెలరోజులపైగా ఈ టీపై ట్రయల్స్‌ చేశామని బారువా అంటున్నారు. భూత్‌ జొలోకియా మిర్చికి ‘బిహ్‌’ ‘జొలొకియా’ ‘రాజా మిర్చి’ (కింగ్‌ చిల్లీ) అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి.

Business ideas assam man earning lakhs with spice tea

Business ideas assam man earning lakhs with spice tea

ఒకసారి ఈ టీని సిప్‌ చేస్తే ‘అబ్బో… ఎంత ఘాటో’ అనాల్సిందే!ఆన్‌లైన్‌లో మార్కెట్.. బారువాకు ఈ స్పెషల్‌ టీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలన్న ఆలోచన రావడానికి ఒక కారణం ఉంది. ఈ రంగంలో బారువాకు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆగ్నేయాసియాలో, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు మిర్చితో చేసిన టీని నిత్యం తాగడం బారువా గమనించారు. బారువా కంపెనీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన ఈ టీ ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. రంజిత్ ఈ టీనే కాకుండా.. ఇంకా చాలా టీలు అమ్ముతూ.. లక్షలు ఘడిస్తున్నారు. ‘అరోమికా ఫైరీ’ టీ పొడి 70 గ్రాముల ప్యాకెట్లు దేశంలోని వివిధ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందిలో 90 శాతం మంది మహిళలు ఉండడం వీరి మరో ప్రత్యేకత.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది