Business Ideas : సొంతూరులో ఉంటూ నెలకు రూ. లక్ష సంపాదించే ఛాన్స్
ప్రధానాంశాలు:
Business Ideas : సొంతూరులో ఉంటూ నెలకు రూ. లక్ష సంపాదించే ఛాన్స్
Business Ideas : భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద పట్టు ఉత్పత్తిదారుగా నిలవడం వెనుక ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టుపురుగుల పెంపకమే కారణం. ముఖ్యంగా మల్బరీ తోటల ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. చైనాకు తర్వాత భారత్ మొత్తం పట్టు ఉత్పత్తిలో 17% వాటా కలిగి ఉంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా ఈ రంగంలో రెండవ స్థానంలో ఉండగా, అక్కడి సుమారు 100 కుటుంబాలు మల్బరీ సాగు ద్వారా నెలకు రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు ఆదాయం పొందుతున్నాయి. మల్బరీ బహువార్షిక పంటగా, తక్కువ నీటితో సాగు చేసి, అధిక లాభాలను అందించే ప్రత్యేకత కలిగి ఉంది.

Business Ideas : సొంతూరులో ఉంటూ నెలకు రూ. లక్ష సంపాదించే ఛాన్స్
Business Ideas మల్బరీ సాగు చెయ్యండి..నెలకే రూ. లక్ష ఆదాయం వెనకేసుకోవచ్చు
పట్టుపురుగుల పెంపకానికి మల్బరీ సాగు ఒక మంచి ఆధారం. ఒక్క ఎకరంలో సుమారుగా 5500 మొక్కలు నాటవచ్చు. సంవత్సరానికి 10 పంటలు తీసుకునే అవకాశం ఉండటం ఈ పరిశ్రమ ప్రత్యేకత. ఒక ఎకరం మల్బరీ తోట ద్వారా ఏడాదికి రూ. 2.5 లక్షల నుండి రూ. 3.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పట్టుపురుగుల పెంపకం ద్వారా గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ పరిశ్రమతో పాటు పాడి పరిశ్రమ, సేంద్రియ ఎరువుల తయారీ కూడా సమాంతరంగా సాగించుకోవచ్చు. ఇలా ఉపాధి కల్పనతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది.
రైతులకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం రాయితీలను అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం, బీసీ, ఓసీలకు 50 శాతం రాయితీ లభిస్తుంది. రెండు ఎకరాల స్థలంలో పట్టు పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు రూ. 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ప్లాస్టిక్ ట్రేలు, చంద్రికలు సైతం రాయితీపై లభిస్తాయి. పట్టు గుళ్లకు రూ.600 నుంచి రూ.800 ధర పలుకుతోంది. జనగామ, హైదరాబాద్ వంటి కేంద్రాల్లో మార్కెట్లు ఉండటంతో విక్రయించడంలో సులభత ఉంది. ఈ పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు రైతుల ఆసక్తి పెరిగితే, గ్రామీణాభివృద్ధిలో పెద్దపాళ్లు పోషించగలదు.