Business Idea : ఈ చెట్లు నాటారంటే 50 లక్షలు మీ సొంతం… అదేంటో చూసేయండి…
Business Idea : ప్రస్తుత చాలామంది కరోనా వచ్చాక సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కరోనా సమయంలో చాలామంది ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. కొందరు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు తమ వ్యవసాయ వృత్తిని ఎంచుకుని లక్షలు సంపాదిస్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయం కాకుండా ఆధునిక వ్యవసాయం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో మలబార్ వేప సాగు చేశారంటే లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు. దీనిని ఎలా సాగు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబార్ వేప చాలా వేగంగా పెరుగుతుంది. అలాగే ఈ చెట్లను ఇతర పంటల మధ్య కూడా నాటవచ్చు. దీంతో సారవంతమైన నేల కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే మలబార్ వేప చెట్లను ఎంత ఎక్కువ భూమిలో పెంచుతున్నారన్న దానిపై లాభం ఆధారపడి ఉంటుంది. మలబార్ వేపను దుబియా చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు మెలియాసి వృక్ష కుటుంబం నుండి వచ్చింది. ఈ చెట్లను ఎక్కువగా దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రైతులు పెద్ద ఎత్తున పండిస్తున్నారు. మలబార్ వేప చెట్టు సాధారణ వేప చెట్టు కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ వేప అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. అలాగే ఈ చెట్టు పెంపకానికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. మార్చి, ఏప్రిల్ లో ఈ మొక్కను నాటడం ఉత్తమం.
నాలుగు ఎకరాల పొలంలో ఐదువేల మలబార్ వేప చెట్లను నాటవచ్చు. ఈ చెట్టు యొక్క చెక్కను నిర్మాణ పనులలో వినియోగిస్తారు. ఈ చెట్టుకు చెదపురుగుల బెడద లేకపోవడంతో ప్లైవుడ్ పరిశ్రమలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ చెట్టు నుంచి లాభాలు రావాలంటే ఎనిమిది ఏళ్ళు ఆగాల్సిందే. ఈ చెట్టు పెరగడానికి, అమ్మడానికి విలువైనదిగా మారటానికి చాలా సమయం పడుతుంది. ఈ చెట్టు కలపను క్వింటాలకి 500 కి అమ్ముతున్నారు. ఒక చెట్టు సుమారుగా 1.5 టన్నుల బరువు ఉంటుంది. ఒక్క చెట్టు నుంచి 6000-7000 వరకు సంపాదించవచ్చు. నాలుగు ఎకరాల్లో 5000 చెట్లు నాటితే అన్ని ఖర్చులు పోను ఈజీగా 50 లక్షల వరకు మిగులుతాయి. మరింత విస్తీర్ణంలో ఈ చెట్లను పెంచి మరిన్ని డబ్బులను సంపాదించవచ్చు.