Business ldea : మహారాష్ట్ర వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసి కోట్లు సంపాదించిన సాధారణ మహిళ
Business ldea : సాంప్రదాయ వంటకాలు అమ్ముతూ కోట్లలో సంపాదిస్తోంది మహారాష్ట్రకు చెందిన మహిళ గీతా పాటిల్. మహారాష్ట్రకు చెందిన వివిధ రకాల వంటకాలను పాటిల్ కాకి పేరుతో ముంబయి, పూణే ప్రాంతాల్లో అమ్ముతోంది గీతా పాటిల్. ఇలా వండటం తాను తన తల్లి నుండి నేర్చుకుంది. కమ్లాభాయి నివుగాలే రోజూ దాదాపు 20 మందికి టిఫిన్లు వండి పెట్టేది. అది చూస్తూ పెరిగిన గీతా పాటిల్ కు కూడా వంటకాలు అంటే ఇష్టం ఏర్పడింది. మహారాష్ట్ర సంప్రదాయ స్నాక్స్ మరియు స్వీట్లను విక్రయించడానికి 2016లో ఇంట్లోనే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. మోదక్, పురాన్పోలి, చాకలి, పోహ మరియు చివ్డా లాంటి పదార్థాలను వండేది గీతా పాటిల్. చాలా తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. మొదట్లో చాలా తక్కువ మంది మాత్రమే ఆమెకు కస్టమర్లుగా ఉండే వారు. ప్రస్తుతం గీతా పాటిల్ కు 3 వేల మంది వినియోగదారులున్నారు. ఏటా రూ. 1 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ముంబైలో పుట్టి పెరిగి, ఇక్కడే ఉండే కుటుంబంలో పెళ్లి చేసుకుంది గీత.
2016లో గీత భర్త గోవింద్ డెంటల్ లేబొరేటరీలో క్లర్క్‌గా ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు తనకు బాగా తెలిసిన, తనకు బాగా ఇష్టమైన ఆహార వ్యాపారం ప్రారంభించాలని అనుకుంది గీత. 2016 నుండి 2020 వరకు, ఎలాంటి అధికారిక బ్రాండింగ్ లేకుండా ఇంటి వంట గది నుండి వ్యాపారం నిర్వహిస్తోంది. ఇది నెమ్మదిగా ప్రారంభమైంది, కానీ అది బాగా జరుగుతుందని గీత నమ్మకం. వారి వ్యాపార ప్రారంభ సంవత్సరాల్లో, ఆమె ప్రభాత్ కాలనీలోని BMC ఉద్యోగులకు అల్పాహారం మరియు టీ-టైమ్ స్నాక్స్ సరఫరా చేసేది. 2016 నుండి 2020 వరకు వ్యాపారం ఎంత డబ్బు సంపాదించిందో గీతకు ఖచ్చితంగా తెలియనప్పటికీ, వారు మొత్తం ఇంటిని నడపడానికి తగినంత మరియు ఎక్కువ సంపాదించారని ఆమె చెప్పింది.
ఈ క్రమంలోనే 2021లో తన కుమారుడు వినిత్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం, వ్యాపారాన్ని స్కేల్ చేయడంలో మరియు ముందుకు తీసుకెళ్లడంలో సహాయం చేశాడు. ఆమె పడిన కష్టాన్ని చూసిన వినీత్… మొట్టమొదటగా, పాటిల్ కాకి అనే పేరుతో ముందుకు వచ్చారు. ఏటా రూ.12 లక్షల ఆదాయాన్ని దాదాపు రూ.1.4 కోట్లకు పెంచేందుకు వినీత్ కృషి చేశారు. శాంటాక్రూజ్‌లో 1,200 చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నారు. వర్క్‌షాప్‌లో మాతో పాటు పనిచేసే మరో 25 మంది మహిళలు కూడా ఉన్నారు.
2018లో బిజినెస్‌లో చేరిన ఆయ్ మరియు ధనశ్రీ కాకి నేతృత్వంలోని ‘పాటిల్ కాకి’ ఇప్పుడు బాగా రాణిస్తోంది. ముంబై మరియు పూణే అంతటా దాదాపు 10,000 పురన్‌పోలి మరియు 500 కిలోల కంటే ఎక్కువ చాకలి తయారు చేయబడి నెలవారీగా రవాణా చేయబడుతుంది. ఈ వ్యాపారం ఇంతలా పుంజుకుంటోందని గీతా పాటిల్ కలలో కూడా ఊహించలేదు. ప్రతి నెలా 3,000 కంటే ఎక్కువ ఆర్డర్‌లు పంపబడుతుండటంతో, బ్రాండ్ అతి త్వరలో ఇతర నగరాలకు తమ సేవలను విస్తరించాలని చూస్తోంది.