Self Business Ideas : ప్లాస్టిక్ బాటిల్స్‌తో రెడీమెడ్ డ్రెస్సులు.. రూ.100 కోట్ల టర్నోవర్.. ఎలా సాధ్యమైందో తెలుసా?
Self Business Ideas : మీరు కూల్ డ్రింక్స్ తాగుతారా? వాటర్ బాటిల్స్ లో వాటర్ తాగుతారా? అవి తాగాక.. బాటిల్స్ ను ఏం చేస్తారు. ఏముంది.. బాటిల్స్ ను క్రష్ చేసి పడేస్తాం అంటారు అంతే కదా. కానీ.. వాటర్ బాటిల్స్ ను మీరు క్రష్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. కానీ.. వీళ్లు మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ అన్నింటినీ సేకరించి ఏంచక్కా రెడీమెడ్ డ్రెస్సులను తయారు చేస్తారు. అసలు ప్లాస్టిక్ బాటిల్స్ తో రెడీమెడ్ డ్రెస్సులు ఎలా సాధ్యం అయ్యాయి అని డౌట్ వస్తోందా.. పదండి.. ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం.
కే శంకర్, సెంథిల్ శంకర్.. ఇద్దరూ తండ్రీకొడుకులు. ఇద్దరూ కలిసి శ్రీ రెంగ పాలీమార్స్ అనే కంపెనీని స్థాపించారు. ఆ కంపెనీ టర్నోవర్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ.100 కోట్లు. వాళ్లు చేసేది ఏంటో తెలుసా? రెడీమెడ్ డ్రెస్సుల వ్యాపారం. కానీ.. వాళ్లకు క్లాత్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్లాస్టిక్ బాటిల్స్ ను రీసైకిల్ చేయడం వల్ల. షాక్ అయ్యారా? రోజుకు 15 లక్షల ప్లాస్టిక్ బాటిల్స్ ను రీసైకిల్ చేసి డ్రెస్సులు తయారు చేస్తున్నారు.
Self Business Ideas : 8 ప్లాస్టిక్ బాటిల్స్ తో ఒక టీషర్ట్ తయారీ
ప్లాస్టిక్ బాటిల్స్ ను రీసైకిల్ చేసి క్లాత్ తయారు చేసి వాటితో టీషర్ట్స్, జాకెట్స్, బ్లేజర్స్ తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఒక్క టీషర్ట్ తయారు చేయడానికి 8 ప్లాస్టిక్ బాటిల్స్ అవసరం అవుతుంది. జాకెట్ తయారు చేయడానికి 20 ప్లాస్టిక్ బాటిల్స్ అవసరం అవుతుంది. బ్లేజర్ తయారు చేయడానికి 30 ప్లాస్టిక్ బాటిల్స్ అవసరం అవుతుంది. ప్లాస్టిక్ వేస్ట్ అనేది రోజురోజుకూ పర్యావరణానికి పెద్ద సమస్యగా మారింది. కానీ.. రోజూ 15 లక్షల బాటిల్స్ ను రీసైకిల్ చేస్తూ వాటి ద్వారా డ్రెస్సులు తయారు చేస్తూ పరోక్షంగా పర్యావరణానికి ఈ కంపెనీ దోహదపడుతోంది.