Earn Money : పని లేకుండా డబ్బులు సంపాదించండి ఇలా..!
ప్రధానాంశాలు:
Earn Money : పని లేకుండా డబ్బులు సంపాదించండి ఇలా..!
Earn Money : కరోనా సమయంలో లాక్ డౌన్ విధించినప్పుడు అందరూ ఇంట్లోనే ఖాళీగా ఉండడం తో తమలోని ఆలోచనలతో పాసివ్ ఇన్ కమ్ కనుగొన్నారు. చాలా తక్కువ శ్రమతో డబ్బులు సంపాదించడం ఎలా అని అనేకమంది ఫేస్బుక్ లో పోస్ట్లు రాయడం, టిక్ టాక్ లో వీడియోలు రాయడం చేశారు. దీంతో ఒకవైపు జాబ్ చేస్తూ మరోవైపు చిన్న మొత్తంలో డబ్బులు సంపాదించేవారు. గతంలో సంపన్నులకు మాత్రమే ఇలాంటి అవకాశం ఉండేది. ఎందుకంటే వారి వద్ద ఉన్న డబ్బుతో ఇల్లు స్థలాలు కొన్ని వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సంపాదించేవారు. అయితే కరోనా కాలంలో పాసివ్ ఇన్కమ్ అనే పదానికి పూర్తిగా అర్థం మారిపోయింది. ఆ సమయంలో యువకులు ముఖ్యంగ మిలియనీల్స్ అదనపు ఆదాయం సంపాదించేందుకు అనేక మార్గాలను కనుగొన్నారు. ఉద్యోగాల్లో ఉండే సవాళ్లు సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రజల మీద పాసివ్ ఇన్ కమ్ ప్రభావం బాగా పెరిగింది.
పాసివ్ ఇన్ కమ్ వలన ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కూడా ప్రజలను ఆ దిశగా ఆలోచించేస్తున్నాయి. పాసివ్ ఇన్కమ్ కోసం దేశంలో కొంత మంది ఫుడ్ బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ బ్లాగర్లుగా మారారు. మరి కొంతమంది డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తారు. షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకొని షేర్లు కొనడం, అమ్మడం కూడా ప్రారంభించారు. వేరే ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ టీచింగ్ ని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. దీనిని సద్వినియోగం చేసుకొని తమ అభిరుచిని నేర్చుకోవడమే కాకుండా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లో చాలామంది పుస్తకాలు రాశారు. వాటిని ప్రచురించి డబ్బు సంపాదించారు. యూట్యూబ్ ఛానల్ లో మహిళలు తమ వంటల క్లాసులతో డబ్బులు సంపాదిస్తున్నారు. కోవిడ్ కి ముందుతో పోలిస్తే తర్వాత యూట్యూబర్లు రకరకాల యూట్యూబ్ చానల్స్ పెట్టి భారీగా సంపాదిస్తున్నారు.
కరోనా సమయంలో బాగా పాపులర్ అయిన మరో వ్యాపారం డ్రాప్ షిప్పింగ్. ఇది చాలా తక్కువ పెట్టుబడితో చేయగలిగే ఆన్లైన్ వ్యాపారం. ఇందులో చాలా వస్తువులను కొనుగోలు చేసి వాటిని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఏదైనా తయారుచేసిన అది అమ్ముడు అవుతుందా లేదా అని బాధ పడాల్సిన అవసరం కూడా లేదు. అందులో సరఫరాదారు నుండి వస్తువులను నేరుగా అవసరమైన వారికి అందిస్తారు. ఆన్లైన్ స్టోర్ ఒక్కటి తెరవాలి. అందులో వస్తువుల సరఫరాదారులతో టైప్ అప్ కావాలి. ఆర్డర్ వచ్చిన వెంటనే ఆ వస్తువును సరఫరా దారు నుండి తీసుకొని కస్టమర్కు ఆన్లైన్లో అమ్మవచ్చు. షేర్లు అమ్మడం కొనడం ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. కరోనా తర్వాత చాలామంది ఆన్లైన్ పోర్టల్, ఇంస్టాగ్రామ్ ఖాతాలు, ఫేస్ బుక్, యూట్యూబ్ సహాయంతో డబ్బులు సంపాదిస్తున్నారు. వీటికి శ్రమ తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పాసివ్ ఇన్ కమ్ అని అంటారు.