Facebook Love : ప్రియుడితో సహా మహిళను కట్టేసి కొట్టిన కాలనీవాసులు
ప్రధానాంశాలు:
Facebook Love : ప్రియుడితో సహా మహిళను కట్టేసి కొట్టిన కాలనీవాసులు
Facebook Love : ఫేస్‌బుక్ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో మహిళ తన ప్రియుడిని ఏకంగా ఇంటికే పిలిపించుకోవడంతో అడ్డంగా దొరికింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని అశోక్ నగర్ లో ఓ మహిళ నివాసముంటుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఫేస్‌బుక్‌లో భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. ఇతడికి గతంలో పెళ్లై విడాకులు తీసుకున్నాడు. ఫేస్‌బుక్ చాటింగ్ కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

Facebook Love : ప్రియుడితో సహా మహిళను కట్టేసి కొట్టిన కాలనీవాసులు
Facebook Love : ప్రియుడితో సహా మహిళను కట్టేసి కొట్టిన కాలనీవాసులు
ఫేస్‌బుక్ ప్రియుడిని మహిళ ఏకంగా తన ఇంటికే పిలిపించుకుంటూ వచ్చింది. ఈ వ్యవహారం ఈ నోటా, ఆ నోటా మొత్తానికి భర్తకు తెలిసింది. కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయినా ఆ మహిళ మరింత రెచ్చిపోయి ప్రవర్తించడం ప్రారంభించింది. భర్త విసుగుచెంది హైదరాబాద్ వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ మరింత రెచ్చిపోయింది.
ఇంట్లో ఇక అడ్డు చెప్పేవారే లేకపోవడంతో ఫేస్‌బుక్ ప్రియుడిని తరచుగా ఇంటికే రప్పించుకునేది. ఈ బాగోతాన్ని ఎన్నో రోజుల నుంచి చూస్తూ వస్తున్న కాలనీ వాసులు ఇక విసిగి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చితకబాది బోరింగ్‌కు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.