Self Employment : రోజుకు కేవలం 2 గంటలు కష్టపడితే చాలు.. నెలకు రూ.50 వేలు ఎటూపోవు.. ఎలాగో తెలుసా?
Self Employment : ఎప్పుడూ 9 టు 5 జాబ్ అంటే కుదరదు. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఎప్పుడూ డబ్బుల కోసం వేరే వాళ్లవైపు ఎదురుచూస్తూనే ఉంటారు. ఎందుకంటే.. ఉద్యోగాల ద్వారా వచ్చే ఆదాయమే అంతంత మాత్రం. అది కూడా సిటీలలో బతకాలి. ఖర్చులు ఎక్కువ. కానీ.. స్వయం ఉపాధి అలా కాదు. ఊళ్లలోనే ఉండి.. రోజుకు కేవలం 2 నుంచి 3 గంటలు కష్టపడితే చాలు.. ఫుల్ రాబడి.అదే కోడిగుడ్ల బిజినెస్. అవును.. ఇది ఫుడ్ బిజినెస్ కిందికి వస్తుంది. ఈరోజుల్లో కోడిగుడ్ల బిజినెస్ కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది.
Self Employment : హోల్ సేల్ లో కొని ఇతర షాపులకు పంపిణీ చేయడమే
ఇప్పుడు ప్రతి ఒక్కరు తినేదే కాబట్టి.. దీని డిమాండ్ ను బట్టి వ్యాపారాన్ని పెంచుకోవచ్చు.దీని కోసం పెద్దగా కష్టపడేది ఏం లేదు. హోల్ సేల్ గా డీలర్ల దగ్గర కోడిగుడ్లను కొనాల్సి ఉంటుంది. వాళ్ల దగ్గర తీసుకొని.. వాటిని అవసరం ఉన్న కిరాణా షాపుల వాళ్ల దగ్గర, హోటల్స్ లో, రెస్టారెంట్లలో.. ఇంకా చిన్న చిన్న షాపులలో అమ్మొచ్చు.దాని కోసం ఒక చిన్న రూమ్, ఒక మిని ట్రాన్స్ పోర్ట్ వాహనం ఉంటే చాలు. ఒక కోడి గుడ్డు మీద రూపాయి నుంచి రూపాయినర వరకు లాభం పొందొచ్చు.
ఒక ట్రే మీద 30 రూపాయల లాభం వస్తుంది. టైమ్ టు టైమ్ ఎగ్స్ రేట్లు కూడా మారుతుంటాయి.కాకపోతే.. ఆ లాభాల్లో హోల్ సేల్ వ్యాపారులకు కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా.. రోజుకు కేవలం ఓ 2 గంటలు కష్టపడితే.. నెలకు 50 వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు.