Business idea : చిన్న ఐడియా.. ఇంజనీర్ కు లక్షలు తెచ్చి పెట్టింది.. రైతులకు లాభాలు గడించేలా చేసింది
Business idea : ఉత్తరప్రదేశ్ కుషినగర్ జిల్లాకు చెందని అక్షయ్ శ్రీవాస్థవ్ చిన్నపట్నుంచి వ్యవసాయంలో అతని తండ్రి పడిన కష్టాలు చూస్తున్నాడు. నీటి సమస్యలు, పెరుగుతున్న వ్యయం, ఎరువులు, సరైన ధరలు లేక ఆతని తండ్రి పడిన ఇబ్బందులు అక్షయ్ కు తెలుసు. ఇవన్నీ చూసి రైతుల కోసం ఏదైనా చేయాలనుకుని పర్యావరణ హితమైన బయోఫెర్టిలైజర్ కనుకున్నాడు అక్షయ్. దీని ద్వారా రైతులకు 30 శాతం దిగుబడి పెరుగుతుంది. భూమి సారమూ పెరుగుతుంది. ఈ బయోఫెర్టిలైజర్ కారణంగా దేశవ్యాప్తంగా 3000 మంది రైతులు లాభపడ్డారు.’రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల పొలాల్లో ఉత్పాదకత తక్కువగా ఉంటుంది
పర్యావరణ కాలుష్యం జరుగుతుంది.నేల నాణ్యత క్షీణిస్తుంది, ఎందుకంటే నీటి నిలుపుదల సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అధిక అవసరాలు ఏర్పడతాయి. నేను ఈ విషయంపై లోతైన అవగాహన పొందడానికి, వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడానికి పరిష్కారాలను కనుక్కోవాలని కెమికల్ ఇంజనీరింగ్ లో చేరాను. చదువుకుంటూ నా పరిశోధనలు ప్రారంభించి.. బయోఫెర్టిలైజర్ ను కనుగొన్నాను’- అక్షయ్మార్చి 2021లో, అతను నవ్యకోష్ బ్రాండ్ పేరుతో ఈ బయోఫెర్టిలైజర్‌ను విక్రయించడానికి తన స్టార్టప్ ఎల్సీబీ ఫెర్టిలైజర్స్‌ని స్థాపించాడు. అతని బయోఫెర్టిలైజర్ గురించి పేపర్లలో రావడంతో.. అక్షయ్ కు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వచ్చాయి.
‘మొదట్లో.. నేను 150 నగరాల్లోని 350 మంది రైతుల నుంచి ఆర్డర్‌లను అందుకున్నాను. దిగుబడి 40 శాతం పెరగడంతో దీనికి ఆధరణ లభించింది. నెలకు 10 లక్షల టర్నోవర్ వస్తోంది. నా దగ్గర 10 టన్నుల ఉత్పత్తి చేస్ ప్లాంట్ ఉంది.ఇప్పుడు నాకు నెలకు 25 టన్నులపైగా ఆర్డర్‌లు వస్తున్నాయి. బయోఫెర్టిలైజర్ వాడే రైతుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నందున రాబోయే రోజుల్లో ఉత్పత్తిని 60 టన్నులకు పెంచాలని అనుకుంటున్నాను.’ – అక్షయ్