Business Idea : ఈ పంటకు ఎండ ఉంటే చాలు, మట్టి అవసరం లేదు… నెలకు లక్షల్లో ఆదాయం…
Business Idea : ప్రస్తుతం మన దేశంలో చాలామంది రైతులు సాంప్రదాయ ఆహార పంటలను కాకుండా ఔషధ గుణాలున్న మొక్కలను పండించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అలాంటి పంటల్లో ఒక్కటే స్పీరులినా. ఇందులో 60, 70% ప్రోటీన్ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ని ఇస్తుంది. అందుకే దీనిని అనేక మందుల్లో ఉపయోగిస్తారు. దీనిని కూడా టాబ్లెట్స్ రూపంలో కూడా అమ్ముతున్నారు. అందుకే దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. స్పిరులినాకు మట్టి అవసరం లేదు, ఇంటి వద్ద ట్యాంకులో కూడా పండించవచ్చు ఎండ ఎంత ఉంటే అంత ఉత్పత్తి పెరుగుతుంది. స్పిరులినాను సముద్ర నాచు అంటారు. ఉప్పునీటిలో బాగా పెరుగుతుంది. దీని సాగుకు ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల వరకు ఉండాలి. 17 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండకూడదు. నీటి పీహెచ్ 9 కంటే ఎక్కువగా ఉండాలి. లేకుంటే సోడియం క్లోరైడ్, బేకింగ్ సోడా, ఉప్పు కలపడం వలన నీటి పీహెచ్ విలువ 9 కి తీసుకురావచ్చు.
స్పిరులినా సాగుకు పొలం వద్ద లేదా ఇంటి వద్ద పొడవైన ట్యాంకులను నిర్మించి అడుగు భాగంలో ప్లాస్టిక్ కవర్ వేసి నీటిని నింపాలి. అనంతరం స్పిరులినా తెచ్చి ఒక గుడ్డలో ఉంచి ట్యాంక్ మొత్తం తిప్పాలి. ట్యాంక్ లో నీటిని కదిలిస్తూ ఉండాలి. టైమర్ తో పనిచేసే మోటార్ను వినియోగిస్తే మంచిది. వాటితో ప్రతి అరగంటకు ఒకసారి కలిపితే చాలు. ఇలా చేయడం వలన స్పిరులినా నీళ్లంతా వ్యాపించి త్వరగా తయారవుతుంది. ఒకసారి ఈ పంట వేశాక 15 రోజుల తర్వాత స్పిరులినా తయారవుతుంది. అప్పటినుంచి ప్రతిరోజు స్పిరులునాను తీయవచ్చు. స్పిరులిలా తయారయ్యాక నీరు ఆకుపచ్చగా మారుతుంది. ఆ నీటిని వస్త్రం ద్వారా ఫిల్టర్ చేయాలి. అప్పుడు వస్ర్తం పై భాగంలో స్పిరులినా ఉండిపోయి నీరు ట్యాంకులోకి వెళ్ళిపోతుంది. స్పిరులినా సేకరించి నీటితో శుభ్రం చేసి నీరు మొత్తం పోయేలా వడ కట్టాలి. తర్వాత మిగిలిన స్పిరులినాను నేరుగా తినవచ్చు. లేదంటే బాగా ఎండబెట్టి పొడి చేసి టాబ్లెట్స్ రూపంలోకి మార్చి నిల్వ చేయవచ్చు.
50 మీటర్ల పొడవు, ఐదు మీటర్ల వెడల్పు ఉండే రెండు ట్యాంకుల్లో స్పిరులిన సాగు చేస్తే మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పెద్దగా ఖర్చు ఉండదు. మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ప్రతిరోజు స్పిరులిన తీసేటప్పుడు తప్ప ఇతర సమయాల్లో పని ఉండదు. మదర్ కల్చర్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది బాగుంటేనే ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే క్వాలిటీది తీసుకోవాలి. రెండు ట్యాంకుల నుంచి ప్రతిరోజు 60 కేజీల తడి స్పిరులినా ను ఉత్పత్తి చేయవచ్చు. అది ఎండిపోయాక ఏడు కేజీలు అవుతుంది. మార్కెట్లో ఒక్కొక్క కేజీ 600 కు అమ్మిన 4,200 ఆదాయం వస్తుంది. దీంతో నెల నెల 1,20,000 వరకు సంపాదించవచ్చు. మిగతా ఖర్చులు పోను నెలకి 78,000 మిగులుతాయి. ట్యాంకులు సంఖ్య పెంచుకుంటే ఆదాయం కూడా ఇంకా పెరుగుతుంది.