Salary Hike : ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. భారీగా పెరగనున్న వేతనాలు!
Salary Hike : దేశంలోని ఉద్యోగస్తులకు ఇది నిజంగానే శుభవార్త అని చెప్పుకోవచ్చు. కొవిడ్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కంపెనీలకు చాలా మేర ఖర్చులు కలిసొచ్చాయి. తాజాగా ఉద్యోగుల వేతనం పెరుగుదల గురించి ఓ ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది.
కార్న్‌ఫెర్రీ ఇండియా వార్షిక రివార్డ్ సర్వే పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో వేతనం, ఇంక్రిమెంట్లు ఈ సంవత్సరం కోవిడ్ ముందు స్థాయికి చేరుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం 2021లో జీతాల సగటు పెంపు 8.4 శాతం ఉండగా.. ఈ ఏడాది సగటు వేతన పెరుగుదల 9.4 శాతంగా ఉండబోతోందని స్పష్టం చేసింది. కొవిడ్‌కు ముందు 2019లో ప్రపంచవ్యాప్తంగా ఇండియా సగటు వేతన పెంపు 9.25 శాతంగా ఉందని సర్వే గుర్తు చేసింది.
2020తో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరం వ్యాపారాలు, కంపెనీలు అన్ని పుంజుకున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంక్రిమెంట్ల చాలా వరకు వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. చాలా కంపెనీలు ప్రత్యేక బెంచ్ మార్క్‌లను ఏర్పరుచుకొని ఇంక్రిమెంట్ల కోసం పెట్టుబడులు పెడుతున్నాయని సర్వే పేర్కొంది. మార్కెట్ పోటీని అన్ని కంపెనీలు బాగా ఎదుర్కొన్నాయి. ఈ కారణంగా లక్ష్యాలను చేరుకొనే స్థాయిని బట్టి ఈ సంవత్సరం మెరుగైన జీతం అందించే అవకాశం ఉంది. ఈ పోటీలో చాలా కంపెనీలు తమ ప్రాథమిక లక్ష్యాలను చేరుకొన్నట్టు తెలిసింది. ప్రస్తుతం 40 శాతం మంది ఉద్యో గులు ఉద్యోగాల కోసం చురుగ్గా ఎదురుచూస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

good news for employees wages will increase massively
Salary Hike : ఉద్యోగుల ఎదురుచూపులు..
టెక్ కంపెనీ లతో సహా అన్ని రంగాలలో రికవరీ బాగుందని సర్వే వెల్లడించింది. ఇది సగటు జీతం పెంపును 10.5 శాతం, లైఫ్ సైన్సెస్ (9.5 శాతం) తదితర అంశాలను గుర్తించింది. సర్వే చేయబడిన 786 కంపెనీలలో 60 శాతం సంస్థలుస్థ నెలవారీ Wi-Fi, యుటిలిటీ బిల్లులను కవర్ చేయడానికి అలవెన్స్‌లు ఇస్తున్నాయి. 46 శాతం కంపెనీలు వెల్‌నెస్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. మరోవైపు, సర్వే చేయబడిన కంపెనీలలో కేవలం 10 శాతం మాత్రమే ప్రయాణ భత్యాన్ని తగ్గించాలని లేదా స్క్రాప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయని సీఎన్‌బీసీ నివేదిక స్పష్టం చేసింది.