Business Idea : మీ తల వెంట్రుకలతో కోట్లు సంపాదించండి ఇలా ..!!
Business Idea ; మన ఇండియాలో తల వెంట్రుకలతో పెద్ద బిజినెస్ జరుగుతుంది. జుట్టుతో కోట్లలో డబ్బులను సంపాదిస్తున్నారు. వెంట్రుకలతో వ్యాపారం చేస్తూ కోటీశ్వరులుగా మారుతున్నారు. మనదేశంలో జుట్టును సేకరించి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. దాదాపుగా మన దేశం నుంచి నాలుగు మిలియన్ డాలర్ల విలువైన జుట్టు విదేశాలకు ఎగుమతి అవుతుంది. విదేశాలకు పంపిన తల వెంట్రుకలో 39 శాతం వార్షిక పెరుగుదల నమోదయింది. అందుకే పల్లెటూర్లలోనే కాదు పట్టణాల్లో కూడా ఇంటింటికి వెళ్లి జుట్టును సేకరిస్తున్నారు. జుట్టు నాణ్యతను బట్టి ధర ఉంటుంది. కిలోకి 8,000 నుంచి పదివేల వరకు ధర పలుకుతుంది. జుట్టు నాణ్యత ఎక్కువగా ఉంటే ఈజీగా 20-25 వేల వరకు ధర ఉంటుంది.
జుట్టు ఎంత పొడవు ఉంటే అంత రేటు వస్తుంది. కోల్కతా, చెన్నై, ఏపీలోని వ్యాపారవేత్తలు హోల్సేల్ గా వెంట్రుకలను కొనుగోలు చేస్తారు. వాటిని విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇక మన ఇండియాలో గుజరాత్ రాష్ట్రంలో తల వెంట్రుకలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి వెంట్రుకలు బలంగా దృఢంగా మెరుస్తూ ఉంటాయి. అందుకే వాటికి రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా సేకరించిన వెంట్రుకలను హెయిర్ ప్లాంటేషన్, విగ్గుల తయారీ కోసం ఉపయోగిస్తారు. కత్తిరించిన జుట్టును శుభ్రం చేసి, ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. తర్వాత స్ట్రైట్ చేసి వాడతారు. అంతా సిద్ధమయ్యాక విదేశాలకు ఎగుమతి చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి.
అప్పుడే విదేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. భారతీయ స్త్రీల జుట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనవాళ్ళ చుట్టూ పొడుగ్గా, నల్లగా ఉంటుంది. అందుకే వీటికి ధర ఎక్కువగా ఉంటుంది. రంగు వేయను జుట్టుకు అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జుట్టు చాలా పొడుగు ఉండి నిగనిగలాడితే కిలో 50 వేల వరకు అమ్ముకోవచ్చు. మనదేశంలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలలో వేలాదిమంది భక్తులు తలనీలాలను సమర్పిస్తారు. ఆ వెంట్రుకలను వేలల్లో విక్రయిస్తారు. ఇలాంటి వ్యాపారం చేయాలనుకునే వారు ఇంటింటికి తిరిగి జుట్టును సేకరించి ఆలయాలలో కూడా ఒప్పందం చేసుకోవచ్చు. అలా సేకరించిన జుట్టును పెద్దపెద్ద కంపెనీలలో అమ్మి భారీ లాభాలను పొందవచ్చు.