Business Ideas : టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ గురించి మీకు తెలుసా? ఇంట్లో కూర్చొని నెలకు లక్ష వరకు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Business Ideas : టీషర్ట్ ప్రింటింగ్ బిజినెస్ గురించి మీకు తెలుసా? ఇంట్లో కూర్చొని నెలకు లక్ష వరకు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 January 2022,3:30 pm

Business Ideas : టీషర్ట్ ల మీద ఉండే ప్రింటింగ్ ను ఎప్పుడైనా చూశారా? కొన్ని మాములుగా ఏదో ఒక టెక్స్ట్ ను కలిగి ఉంటాయి. మరికొన్ని టీషర్టుల మీద ప్రముఖ బ్రాండ్స్ పేర్లు ఉంటాయి. ఒకప్పుడు టీషర్టులను ఎక్కువగా వాడేవాళ్లు కాదు కానీ.. ఇప్పుడు యూత్ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరు టీషర్టులను వేసుకుంటున్నారు. చివరకు యువతులు, మహిళలు కూడా టీషర్టులను వేసుకుంటున్నారు. అందుకే.. కొన్ని కంపెనీలు టీషర్టులతో తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకుంటున్నాయి.టీషర్టులపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ద్వారా బ్రాండ్స్ పేర్లు రాసి ప్రమోట్ చేస్తుంటారు. దీంతో టీషర్టులపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడం ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. కొన్ని రకాల ప్రమోషన్స్ కోసం కూడా ఇప్పుడు టీషర్టులపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయిస్తున్నారు.ఉదాహరణకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ యూనిట్.. కొన్ని టీషర్టులపై ఆర్ఆర్ఆర్ ప్రింటింగ్ చేయించింది. అలాగే..

అల్లు అర్జున్ ఫేమస్ డైలాగ్ తగ్గేదేలే పేరుతో కూడా కొన్ని టీషర్టులు బయటికి వచ్చాయి. గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి బడా కంపెనీలు కూడా ఇలా తమ బ్రాండ్స్ తో టీషర్ట్స్ ను ప్రింట్ చేయిస్తుంటాయి.టీషర్టులపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ను ప్రింట్ చేయడం కోసం ఒక మిషిన్ అవసరం ఉంటుంది. ఆ మిషిన్ ధర 20 వేల లోపు ఉంటుంది. ఒకవేళ బల్క్ లో టీషర్టుల కోసం ఆర్డర్ వస్తే మాత్రం లక్ష రూపాయల విలువ గల మిషిన్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.మిషిన్లను ఆన్ లైన్ లోనూ కొనుగోలు చేయొచ్చు. ఆ తర్వాత టెఫ్లాన్ షీట్, సబ్లిమేషన్ టేప్, ప్రింటింగ్ ఇంక్ మాత్రం అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాని కోసం మరో రెండు మూడు వేల వరకు ఖర్చు అవుతుంది అంతే. ఇలా.. ఈ బిజినెస్ లో నెలకు కనీసం 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

how to get profit in t shirt business and how to start

how to get profit in t shirt business and how to start

Business Ideas : ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి?

ఆర్డర్స్ పెరిగితే ఆదాయం లక్షల్లో ఉంటుంది.ఈ బిజినెస్ లో పెట్టుబడి ఒకేసారి ఉంటుంది. ఆదాయం మాత్రం ప్రతి నెల పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. జీవితాంతం ఈ బిజినెస్ ద్వారా నెలకు లక్షలకు లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ను ఇంట్లో ఉండే మహిళలు కూడా ప్రారంభించవచ్చు.లేదంటే.. టీషర్టులను మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి.. ప్రింట్ చేసి సొంతంగా కూడా అమ్ముకోవచ్చు. దాని కోసం టీషర్టులను బల్క్ గా తెచ్చుకోవాలి. ప్రింటింగ్ చేశాక.. వాటిని మార్కెట్ లో తిరిగి బల్క్ గా అమ్మొచ్చు. లేదంటే.. ఆన్ లైన్ ద్వారా మార్కెటింగ్ చేసుకొని కూడా అమ్ముకోవచ్చు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది