Business Idea : పది ఫెయిల్ అయిన ఏం కాదు… ఉన్న ఊర్లోనే దర్జాగా రూ.70,000 సంపాదించవచ్చు…
Business Idea : డబ్బు సంపాదించడం కోసం ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం ప్రారంభిస్తుంటారు. వాస్తవానికి ఉద్యోగం ఇప్పుడు చాలామందికి అవసరం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చాలామంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన పోస్టులకు మాత్రమే రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి అందరికీ గవర్నమెంట్ జాబ్ దొరకదు. అయితే ఈరోజుల్లో చేతిలో పని, జేబులో డబ్బు ఉంటేనే అందరు గౌరవిస్తారు. అయితే ఈ టెక్నాలజీ కాలంలో మొబైల్, లాప్ టాప్ లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా లాప్ టాప్స్, మొబైల్స్ ని వాడుతున్నారు. అలాగే వీటి రిపేర్లకు గిరాకీ కూడా పెరిగింది. జాబ్ లేనివాళ్లు మొబైల్, లాప్ టాప్ రిపేర్ కేంద్రాన్ని తెరవడం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించవచ్చు.
లాప్ టాప్, మొబైల్ వినియోగం పెరుగుతున్న కారణంగా వాటిని రిపేర్ చేయడానికి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఈ బిజినెస్ ని ప్రారంభించే ముందు ఆన్ లైన్ లో లాప్ టాప్, మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవచ్చు. ఇనిస్ట్యూట్ కి వెళ్లి నేర్చుకోవడం ఇంకా మంచిది. కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు రిపేరు సెంటర్ లో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాప్ టాప్, మొబైల్ రిపేరింగ్ లో ఆరితేలిన వారు సొంత రిపేర్ కేంద్రాన్ని పెట్టుకోవచ్చు. ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రజలు సులభంగా వచ్చే చోట లాప్ టాప్ రిపేర్ కేంద్రాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయం వస్తుంది. మీరు తెరిచే ప్రాంతంలో ఇప్పటికే కంప్యూటర్ రిపేర్ కేంద్రాలు ఉన్నాయో లేదో చెక్ చేయండి.
సోషల్ మీడియా ద్వారా రిపేర్ కేంద్రాన్ని ప్రచారం చేయొచ్చు. దీని వలన మరింత మందికి చేరుతుంది. అలాగే మీ పని బాగా జరిగితే కేంద్రానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. లాప్టాప్, మొబైల్ రిపేర్ కేంద్రాన్ని తెరవటానికి అవసరమైన పార్ట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి. పట్టణం లేదా నగరంలో రిపేర్ కేంద్రాన్ని పెట్టడం ద్వారా భారీ ఆదాయం పొందవచ్చు. రెండు నుంచి నాలుగు లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి కంప్యూటర్ రిపేర్ కేంద్రాన్ని మొదలు పెట్టవచ్చు. రిపేరు చేయడమే కాకుండా రోజులు గడిచేకొద్దీ లాప్టాప్ లు, మొబైల్స్ ను ఈజీగా అమ్మవచ్చు. మొబైల్స్, లాప్టాప్ రిపేర్ చార్జీలు చాలా ఎక్కువ. కాబట్టి నెలకు 78 వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. మీ పనితీరు మీదే మీ సంపాదన నిర్ణయించబడుతుంది.