Saffron : ఇంటిని మినీ కశ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంపతులు
ప్రధానాంశాలు:
Saffron : ఇంటిని మినీ కశ్మీర్‌గా మార్చి 'కుంకుమపువ్వు' పండిస్తున్న దంపతులు
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే ‘కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. ఇందుకోసం వారు తమ ఇంటిని మినీ-కాశ్మీర్‌గా మార్చుకున్నారు. దంపతుల సంకల్పం, అంకితభావం మరియు కృషితో కేవలం మూడు నెలల వ్యవధిలోనే కుంకుమ పువ్వులు వికసించాయి. ఇండోర్‌లోని సాయి కృపా కాలనీ నివాసి, సాగుదారు అనిల్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని తమ ఇంటి వద్ద అనుకూలమైన పరిస్థితిని సృష్టించడం ద్వారా కుంకుమ పువ్వు పంటను పండించే తన ఆలోచనలను పంచుకున్నారు. తాను సంప్రదాయ వ్యవసాయం చేసే కుటుంబానికి చెందినవాడినని, కాశ్మీర్ పర్యటన తర్వాత కుంకుమపువ్వు సాగు చేయాలనే ఆలోచన వచ్చిందని ఆయన తెలిపారు.
తమ కుటుంబం సాంప్రదాయ వ్యవసాయంలో నిమగ్నమై ఉందని, కొంతకాలం క్రితం, కుటుంబంతో కలిసి కాశ్మీర్‌కు వెళ్లగా శ్రీనగర్ నుండి పాంపోర్‌కు వెళ్లే మార్గంలో కుంకుమపువ్వు సాగును చూసే అవకాశం లభించిందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా అన్నారు. ఆ తరువాత తాము ఇండోర్‌లో ఆదర్శ ఉష్ణోగ్రత మరియు వాతావరణ పరిస్థితులను సృష్టించడం ద్వారా దాని సాగు గురించి ఆలోచింనట్లు జైస్వాల్ చెప్పారు. జైస్వాల్ జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పాంపోర్, టౌన్ నుండి కుంకుమపువ్వు బల్బులను (కార్మ్) పొందారు.
8 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతను కొనసాగిస్తూ, కృత్రిమ వాతావరణ పరిస్థితులతో కూడిన గదిని సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 6 లక్షలు ఖర్చు కాగా, పాంపోర్ నుండి బల్బులను సోర్సింగ్ చేయడానికి అదనంగా మరో రూ. 7 లక్షలు ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరులో 320 చదరపు అడుగుల విస్తీర్ణంలో కుంకుమపువ్వు సాగు చేయడం ప్రారంభించినట్లు చెప్పారు. సుమారు 2 కిలోల కుంకుమ పువ్వు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని, ప్రస్తుతం పూల నుంచి కుంకుమ దారాలు తీసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. భారత్‌లో కిలో రూ. 5 లక్షలు ఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 8 లక్షల వరకు పలుకుతుందని, అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించాలని యోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. cultivating saffron at home, saffron, Indore, saffron cultivation