Business Idea : 79 ఏళ్ల వయసులో చాయ్ మసాలా బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్న బామ్మ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business Idea : 79 ఏళ్ల వయసులో చాయ్ మసాలా బిజినెస్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తున్న బామ్మ

Business Idea : వయస్సు మీద పడుతున్న కొద్దీ చాలా మంది తమకు తాము కొన్ని పరిమితులు విధించుకుంటారు. కొన్ని రకాల పనులు తమతో కావనే నిర్ణయానికి వచ్చేస్తారు. ముఖ్యంగా పెళ్లై పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక… ఏ చిన్న రిస్క్ తీసుకోవడానికైనా చాలా సంకోచిస్తుంటారు. ఇంకా వృద్ధాప్యం మీద పడగానే ఇక తమ జీవితం అయిపోయిందనుకుంటారు. కానీ ఆ సమయంలోనూ కొందరు మంచి మంచి విజయాలు సాధిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఏజ్ బార్ […]

 Authored By jyothi | The Telugu News | Updated on :17 March 2022,12:00 pm

Business Idea : వయస్సు మీద పడుతున్న కొద్దీ చాలా మంది తమకు తాము కొన్ని పరిమితులు విధించుకుంటారు. కొన్ని రకాల పనులు తమతో కావనే నిర్ణయానికి వచ్చేస్తారు. ముఖ్యంగా పెళ్లై పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగాక… ఏ చిన్న రిస్క్ తీసుకోవడానికైనా చాలా సంకోచిస్తుంటారు. ఇంకా వృద్ధాప్యం మీద పడగానే ఇక తమ జీవితం అయిపోయిందనుకుంటారు. కానీ ఆ సమయంలోనూ కొందరు మంచి మంచి విజయాలు సాధిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. ఏజ్ బార్ అయినా… నవ యవ్వనంగానే పని చేస్తూ ఫలితం పొందుతుంటారు. ముంబయిలోని శాంతా క్రజ్ వెస్ట్ కు చెందిన శ్రీమతి కోకిలా పరేఖ్.. తన 79 ఏళ్ల వయస్సులో బిజినెస్ స్టార్ చేసి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. టీ మసాలా పౌడర్ ను విక్రయిస్తూ… మంచి లాభాలు సంపాదిస్తున్నారు.

కోకిలా పరేఖ్క ముంబయిలోని శాంతా క్రజ్ వెస్ట్ లో తన కొడుకు, కోడలితో కలిసి ఉంటున్నారు. ఆమె చేసే మసాలా టీకి బంధుమిత్రుల్లో చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. అతిథులు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మసాలా ఛాయ్ తో పాటు వేడి వేడి స్నాక్స్ ఇచ్చేది. వాటి రుచిని చాలా మంది అమితంగా ఇష్టపడే వారు. తమ టీని మెచ్చుకునే ప్రతి ఒక్కరికి తను తయారు చేసే మసాలా టీ గురించి మొత్తం వివరిస్తూ ఉండేది. వాళ్లు తిరిగి వెళ్లే సమయంలో కొంత ప్యాక్ చేసి ఇస్తూ ఉండేది. క్రమంగా ఇలా మసాలా పౌడర్ కావాలంటూ అడిగే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఆమె మసాలా పౌడర్ గురించి బంధుమిత్రులతో పాటు వేరే వారికి కూడా తెలియడం మొదలైంది.

mumbai senior citizen home business lockdown chai masala

mumbai senior citizen home business lockdown chai masala

శ్రీమతి పరేఖ్ ఉదయం గుడికి వెళ్లడం, అల్పాహారం చేసే వంట మనిషిని పర్యవేక్షించడం, తన కోడలుతో సమయం గడపడం, మధ్యాహ్నం నిద్రపోవడం, సాయంత్రం బంధువు లేదా స్నేహితులను కలవడానికి వెళ్లడం ఇదే తన దినచర్యగా వస్తోంది. కానీ ఎప్పుడైతే కరోనా లాక్ డౌన్ మొదలైందో తన దినచర్యను కోకిలా ఫరేఖ్ పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. అప్పుడే తనకు చాయ్ మసాలా పొడిని విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంది. కోకిల మరియు తుషార్ యొక్క చాయ్ మసాలా- KT చాయ్ మసాలా పేరుతో బిజినెస్ మొదలు పెట్టింది. వంటింట్లో ఉపయోగించే మిక్సర్ తో మసాలా తయారు చేస్తూ విక్రయించడం ప్రారంభించగా… క్రమంగా వినియోగదారులు పెరగడంతో మరింత సామర్థ్యం ఉన్న మిక్సర్ ను కొనుగోలు చేశారు కోకిల.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది