Business Idea : నెలకు లక్షల ఆదాయాన్ని ఇచ్చే పానీ పూరి బిజినెస్ .. పెట్టుబడి కూడా తక్కువే ..!
Business Idea : మన ఇండియాలో అత్యంత ప్రాముఖ్యత గల స్ట్రీట్ ఫుడ్ పానీ పూరి. ఏ నీళ్లు వాడతారో తెలియదు కానీ ఆ రుచి మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇక పానీపూరీ ఇష్టపడని వారు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు పానీ పూరీని తినడానికి ఇష్టపడుతున్నారు. అందుకే పానీపూరీకి డిమాండ్ బాగా ఉంది. కాబట్టి మీరు గనక పానీ పూరి బిజినెస్ చేస్తే అధిక లాభాలను పొందవచ్చు. శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. ఒత్తిడి ఉండదు. టార్గెట్ ఉండదు. పైగా పానీ పూరి బిజినెస్ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 ,10 గంటల వరకు జనాలు వస్తూనే ఉంటారు. షాపింగ్ మాల్స్ పక్కన, రద్దీగా ఉండే ప్రదేశాలలో కనుక
ఈ బిజినెస్ పెట్టారంటే లక్షాధికారులు కావచ్చు. పానీ పూరి చేయడానికి ఆటోమేటిక్ మిషన్లు ఉన్నాయి. ఇవి గంటకి ఐదు వేల పానీ పూరీలను చేస్తాయి. వీటి ధర 35 వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. చిన్న మిషన్లు అయితే 25 వేల నుంచి 40 వేల వరకు ఉంటాయి. మేకింగ్ మిషన్ తో పాటు పానీపూరి మిషన్ కూడా కావాల్సి ఉంటుంది. ఇది పానీ పూరి నీరు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కౌంటర్ తో పాటు కలిపి వస్తుంది. దీని ధర 35 వేల వరకు ఉంటుంది. ఈ మిషన్లు ఆన్లైన్లో దొరుకుతాయి. ఇక పానీపూరిని సరైన ప్లేసులో పెట్టారంటే గంటకి 800 నుంచి ₹1000 వరకు సంపాదించవచ్చు. 8 గంటలు పని చేసిన 6000 నుంచి 8000 వరకు సంపాదించవచ్చు.
వీటిలో షాప్ రెంట్, కరెంట్ బిల్, జిఎస్టి, ముడి పదార్థాలకు పెట్టిన ఖర్చులు అన్నీ తీసేస్తే 2000 అయినా లాభం ఉంటుంది. నెలకు 60,000 వరకు సంపాదించవచ్చు. ప్రస్తుతం ఆహారాన్ని శుభ్రంగా తినాలని కోరుకుంటున్నారు. చేతికి గ్లౌజులు వేసుకుని చేతులతో టచ్ చేయకుండా మిషన్ల ద్వారా చేసిన ఫుడ్ ను ఇష్టపడుతున్నారు. మిషన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువమందికి సర్వ్ చేయవచ్చు. కాబట్టి లక్ష రూపాయలు ఉంటే పానీపూరి వ్యాపారం పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. ఇక మరో బిజినెస్ అయిన నష్టపోయి ఉండొచ్చు గాని పానీ పూరి బిజినెస్ చేసి నష్టపోయిన వారు ఉండరు. ఎందుకంటే పానీ పూరి బిజినెస్ కి అంత క్రేజ్ ఉంది మరి.