SriGandham : శ్రీగంధం సాగు ఒక్కసారి చేస్తే చాలు.. లక్షల్లో సంపాదన.. వద్దన్న డబ్బులు కుప్పలుగా వస్తాయి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SriGandham : శ్రీగంధం సాగు ఒక్కసారి చేస్తే చాలు.. లక్షల్లో సంపాదన.. వద్దన్న డబ్బులు కుప్పలుగా వస్తాయి

 Authored By jagadesh | The Telugu News | Updated on :8 January 2022,6:00 am

SriGandham : శ్రీగంధం సాగు అనేది ఇప్పుడు ఎంతో లాభదాయకమైన సాగు. శ్రీగంధం చాలా విలువైనది. దానికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంటుంది. ఆయుర్వేద మందులలో.. పలు కాస్మొటిక్స్, బ్యూటీ ప్రాడక్ట్స్ లో శ్రీగంధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే రోజురోజుకూ వీటికి డిమాండ్ పెరుగుతోంది.పర్ ఫ్యూమ్స్ , అగరుబత్తుల తయారీలోనూ శ్రీగంధం చెక్కను ఉపయోగిస్తారు. అందుకే.. చాలామంది రైతులు ఇప్పుడు శ్రీగంధం సాగువైపు మళ్లుతున్నారు.

శ్రీగంధం సాగు చేయాలంటే కాసింత భూమి ఉంటే చాలు. ఒక్కసారి సాగు చేస్తే లక్షల్లో సంపాదించుకోవచ్చు.. వద్దన్న డబ్బులు కుప్పలుగా వచ్చేస్తాయి.శ్రీగంధం సాగు చేయడానికి ఒక ఎకరం భూమి ఉన్నా చాలు. ఒక ఎకరం భూమిలో సుమారు 250 శ్రీగంధం చెట్లను నాటుకోవచ్చు. అయితే.. కనీసం చెట్లను పెట్టిన తర్వాత ఒక 20 ఏళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది.20 ఏళ్ల వరకు ఆగితే.. కనీసం 20 కిలోల శ్రీగంధం చెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో శ్రీగంధం చెక్కకు మంచి డిమాండ్ ఉంది.

srigandham crop gives better profits

srigandham crop gives better profits

SriGandham : శ్రీగంధం సాగు ఎలా చేయాలి?

ఒక కిలో కనీసం రూ.8000 పలుకుతోంది. అలాగే.. శ్రీగంధం సాగు కోసం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. శ్రీగంధం చెట్లకు అప్పుడప్పుడు నీళ్లు పెడితే చాలు. అవే ఎదుగుతాయి.అరుదుగా కంపోస్ట్ ఎరువులు వాడొచ్చు. సేంద్రీయ ఎరువులు వాడితే.. శ్రీగంధం సాగు తొందరగా కాపుకు వస్తుంది. చెక్క కూడా ఊరుతుంది. బరువు పెరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ దగ్గర కూడా భూమి ఉంటే.. వెంటనే శ్రీగంధం సాగును చేసుకోండి. లక్షల్లో సంపాదించుకోండి.

Also read

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది