Oil Palm : గుడ్‌న్యూస్.. ఆ పంటకు ఏకరాకి లక్ష రాయితీ.. పూర్తి వివరాలు..!
ప్రధానాంశాలు:
Oil Palm : గుడ్‌న్యూస్.. ఆ పంటకు ఏకరాకి లక్ష రాయితీ.. పూర్తి వివరాలు..!
Oil Palm : తెలంగాణ Telangana Govt ప్రభుత్వం రొటీన్ పంటలు కాకుండా.. భిన్నమైన పంటల వైపు ఫోకస్ పెడుతుండడం మనం గమనించవచ్చు. అందులో భాగంగా.. ఆయిల్ పామ్ Oil Palm పంటను ప్రోత్సహిస్తోంది. ఈ పంటకు పెట్టుబడి తక్కువ. లాభాలు ఎక్కువ. దీనికి సబ్సిడీపై మొక్కలు, ఎరువులు, డ్రిప్ పరికరాల్ని ప్రభుత్వం అందిస్తోంది. ఆయిల్‌పామ్ సాగుకి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. మార్చి 2025 నాటి కల్లా లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Oil Palm : గుడ్‌న్యూస్.. ఆ పంటకు ఏకరాకి లక్ష రాయితీ.. పూర్తి వివరాలు..!
వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ పథకాల అమలు, అధికారుల పనితీరుపై తుమ్మల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇప్పుడు తెలంగాణ రైతులు Telangana Farmers కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఆయిల్ పామ్ సాగుచేస్తే.. 4 ఏళ్లలో తొలి పామాయిల్ సీడ్స్ వస్తాయి. అలా అవి నెక్ట్స్ 30 ఏళ్లపాటూ వస్తూనే ఉంటాయి. అంటే.. మొదట్లో పెట్టుబడి ,తర్వాత మంచి లాభాలుంటాయి. ప్రస్తుతం పామాయిల్ గెలలు క్వింటాలు ధర రూ.20,400 ఉంది. వాటికి చీడపీడలు కూడా పెద్దగా పట్టవు.
తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభం పొందవచ్చు. ఇంకా.. ప్రభుత్వం సబ్సిడీలు Subsidy కూడా బాగా ఇస్తోంది. అంటే.. ఆయిల్ పామ్ మొక్క ధర రూ.250 ఉంటే, ప్రభుత్వం రూ.20కే ఇస్తోంది. ఆలాగే.. సాగు చేసే రైతుకి ఎకరానికి రూ.27,801 చొప్పున నాలుగేళ్లు రాయితీ ఇస్తోంది. ఇంకా.. అంతరపంట వేస్తే.. రూ.4,200 ఇస్తోంది.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సీడ్లను తోటలో కోసిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ మిల్లులకు తరలించడానికి వాటి ఖర్చులు భరిస్తోంది. అందువల్ల రైతులకు అలా కూడా మేలు జరుగుతోంది. ప్రస్తుతం ఎకరాకి రైతుకి రూ.2లక్షల 40 వేలు ఆదాయం వస్తోంది. ఇందులో ఖర్చులు రూ.40వేలు పోగా.. సంవత్సరానికి ఎకరానికి రూ.2 లక్షల దాకా లాభం ఉంటుంది . వచ్చే 4 ఏళ్లలో 10 లక్షల టార్గెట్ పెట్టుకోగా, ఈ పంటని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటంతో.. రైతులు కూడా ఆసక్తిగా ఆయిల్ పామ్ వైపు చూస్తున్నారు.