Vertical Farming : ఈ టెక్నిక్‌తో రైతులు కోటీశ్వరులు కావచ్చు.. ఏడాదికి రూ.కోట్లలోనే ఆదాయం..
Vertical Farming : మన దేశంలో రోజురోజుకూ జనాభా పెరుగుతున్న సంగతి అందరికీ విదితమే. 2050 నాటికి భారతదేశ జనాభా 1.64 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అంత మంది జనానికి ఆహారం అందించడం అనేది ఒక సవాలుగా మారనుంది. ఇకపోతే కొన్నేళ్లుగా దేశంలో వ్యవసాయ యోగ్యమైన భూమిని కోల్పోతూనే ఉన్నాం. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వలన భూమి కమర్షియల్ యూసేజ్ అయిపోతున్నది. అలా పంటల పొలాలకు కొంత భూమి దూరమవుతున్నది. ఈక్రమంలోనే ఈ టెక్నిక్ ఉపయోగించి మీరు పండ్లు, కూరగాయలు పండించడంతో పాటు మంచి లాభాలు కూడా పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
భూమిపైన కాకుండా ఫ్యాక్టరీలు ఇతర చోట్లలో పండ్లు, కూరగాయలు పండించొచ్చు. ఈ టెక్నిక్ నే వర్టికల్ ఫార్మింగ్ అంటారు. అనగా నిలువు వ్యవసాయం.. ఈ ఇజ్రాయెల్‌తో పాటు ఇతర దేశాలలో ఈ టెక్నిక్ ఫాలో అవుతున్నారు. ఈ విధానం ద్వారా నేల మీద.., నేల పైన కూడా వ్యవసాయం చేయొచ్చు. ఇటీవల ఈ విధానాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలో స్టార్ట్ చేశారు. పసుపును ఇక్కడ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా పండిస్తున్నారు. ఓ షెడ్‌లో పసుపును సాగు చేస్తూ అక్కడి ఉష్టోగ్రత, వాతావరణ పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునేవిధంగా ఏర్పాట్లు చేసి మరీ పసుపును పండిస్తున్నారు.
Vertical Farming : ఈ టెక్నిక్‌ను ఫాలో అవుతున్న విదేశాలు..
ఇలా వర్టికల్ ఫార్మింగ్ చేయడం వలన లాభాలు కూడా బాగానే పొందొచ్చు. పసుపును వంటిట్లో మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో ప్రొడక్ట్స్ మేకింగ్‌లో యూజ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ వర్టికల్ ఫార్మింగ్ టెక్నిక్ ఉపయోగించి మీరు ఒకే ఒక ఎకరం నుంచి వంద ఎకరాల ఉత్పత్తిని పొందవచ్చును. అలా మీరు సుమారుగా రూ.2.5 కోట్లు ఒకే ఒకరంలో సంపాదించే అవకాశాలుంటాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కొందరు రైతులు పసుపు పంటను పండించే లాభాలు గడిస్తున్నారు కూడా. ఈ క్రమంలోనే వర్టికల్ ఫార్మింగ్ సిస్టమ్ గురించి రైతులు అవగాహన ఏర్పరుచుకుని ఆ పద్ధతిని ఫాలో అయితే మంచి లాభాలు వస్తాయని, ఆ దిశగా అడుగులు వేయాలని కొందరు రైతులు సూచిస్తున్నారు.