Astrology Tips : మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ 5 విషయాలను చూసారంటే ఏమౌతుందో తెలుసా ?
Astrology Tips : ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కొందరు ఎదురు వస్తూ ఉంటారు. అయితే కొందరిని చూడడం వలన మనకు మంచి జరుగుతుంది. మరికొందరిని చూడడం వలన చెడు జరుగుతుంది. మనుషులు అనే కాదు ఇతర ఏ వస్తువులు ఎదురుగా వచ్చిన ఇలానే జరుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ ఐదు విషయాలను చూస్తే శుభం కలుగుతుందంట. వీటి వలన మనం అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే ఇప్పుడు ఆ ఐదు విషయాలు ఏంటో తెలుసుకుందాం.
1) మనం ఏదైనా పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ సమయంలో మీకు శంఖం శబ్దం వినిపిస్తే చాలా మంచిది. అలా వినిపిస్తే అంతకన్నా మంచి శకునం మరొకటి ఉండదు. శంఖం శుభానికి సంకేతం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భగవంతుడి అనుగ్రహం ఉందని అర్థం. మీరు చేయాలి అనుకున్న పనుల్లో మంచి విజయం సాధిస్తారు.

Astrology Tips if you see these 5 things along the way you will successful
2) అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆవు కానీ ఆవు దూడకు పాలు ఇస్తున్న తల్లి ఆవు కనిపిస్తే చాలా మంచిది. ఇలా కనిపిస్తే అది మీకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలా కనిపించినప్పుడు ఆవుకు ఆహారంగా ఏమైనా పదార్థాలు పెడితే మీకు ఇంకా మంచి జరుగుతుంది. అలాగే మనం ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో ఆవు పేడ కనిపించిన శుభ సూచకమే.
3) మీరు ఏదైనా పనిమీద బయటికి వెళ్లేటప్పుడు ఆ సమయంలో ఒక బిచ్చగాడు ఎదురుగా వస్తే అది మీకు శుభసంకేతంగా పరిగణించబడుతుంది. అలా వచ్చిన బిచ్చగాడికి ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేశారంటే మీకు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. అలాగే వేరే వాళ్లకు అప్పుగా ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయి.
4) జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు దారిలో మీకు అంత్యక్రియల ఊరేగింపు కనిపిస్తే చాలా మంచిది. అలాగే దానికి చేతులు జోడించి నమస్కరించి వెళ్ళాలి. ఇలా చేయడం వలన మీకు శుభం జరుగుతుంది. అంత్యక్రియలో ఊరేగింపు కనిపించడం కూడా ఒక శుభ సూచకమే.
5) ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దేవాలయంలోని గంట శబ్దం వినబడితే చాలా మంచిది. అలా వినిపిస్తే మీకు తప్పక విజయం కలుగుతుంది. దీని వలన మీరు చేయాలనుకుంటున్న పనికి దేవుడి సహకారం ఉంటుంది. దీంతోపాటు మీ ఇల్లు సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో కళకళలాడుతుంది.