Ayodhya Ram Mandir : అయోధ్యపురిలో కొలువుదీరిన బాలరాముడు.. లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా…?
ప్రధానాంశాలు:
Ayodhya Ram Mandir : అయోధ్య మందిరంలో లోపలి ప్రాంగణం ఎంత వైభవంగా ఉందో వీక్షించారా...?
Ayodhya Ram Mandir : దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న కల నేరవేరింది. బాలరాముడు అయోధ్యపురిలో కొలువుదీరాడు. కౌసల్యా తనయుడికి ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు . జన్మస్థలమైన అయోధ్య రామ మందిరంలో స్వామివారు సాక్షాత్కరం కాబోతున్నారు. ఎన్నో శతాబ్దాల కల తీరబోతుంది..
ప్రాణ ప్రతిష్టకు దేశ విదేశాల నుండి ఎందరో అతిధులు విచ్చేయుచున్నారు.. అయితే శ్రీరామ జన్మభూమి తీర్థాక్షేత్రం జారీ చేసే అడ్మిట్ కార్డు ద్వారానే ఎంట్రీ ఉంటుందట..
సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు రామ మందిరంలో రామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్నది.. ప్రధాన పూజ అజిత్ ముహూర్తంలో నిర్వహించనున్నారు…
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉదయం 10:00 నుండి మంగళ ధ్వనితో ప్రారంభమవుతుంది.
సుమారు రెండు గంటలపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది పైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరామునికి నీరాజనం అర్పించనున్నారు…
రామ జన్మభూమి తీర్ధక్షేత్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్ రాయ్ మాట్లాడుతూ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 1:00 లోపు పూర్తవుతుందని చెప్పారు..
కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రావిడ్ ఆచార్య, లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ కార్యక్రమంలో నిర్వహించనున్నారు. 150కి పైగా సాంప్రదాయాలు 50 పైగా గిరిజన తీర, ద్వీపం తదితర సాంప్రదాయాలకు చెందిన సాధువులు ప్రముఖులు విచ్చేయుచున్నారు…
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం రామజ్యోతి వెలిగించి దీపావళిని జరపనున్నారట. సాయంత్రం పదిలక్షల దీపాలతో అయోధ్య ఎలిగిపోతుంది. దుకాణాలు, ఇళ్లు కూడా దీపాలతో ఎలగనున్నాయి. నది ఒడ్డున దీపాలతో దీపావళి పండగ లాగా జరపనున్నారు..
అయితే శుభముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 12:30 32 సెకండ్ల వరకు ఉంటుంది. అంటే ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం 84 సెకండ్లు మాత్రమే.. ప్రధాని నరేంద్ర మోడీ, శ్రీరామ్ లల్లా విగ్రహానికి ప్రతిష్టాపన చేయనున్నారు…