Ugadi : ఉగాది రోజు ఇది తప్పక పాటించండి.. ఇక మీరు కోటిశ్వరులే..
Ugadi : తెలుగు వారి ఉగాది పండుగ తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ పండుగ తెలుగు ప్రజలకు ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఉగాది రోజున పచ్చడిని తయారుచేసుకుని దేవుడికి సమర్పించిన తర్వాత తింటారు. చింతపండు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయ, కొబ్బరి ముక్కలు, మిరపకాయలతో పచ్చడిని తయారుచేసి ఇష్ట దేవతలకు నైవేధ్యంగా సమర్పించి తర్వాత ప్రసాదం స్వీకరిస్తారు.ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం.
చైత్రమాసం మొదటి రోజైన చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు.ఉగస్య ఆది అనేదే ఉగాది. సంవత్సరానికి తొలి మాసం చైత్రమాసం… చైత్రమాసం అనగానే మనకి ఈనెలలో ఉగాది, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి. చైత్ర శుధ్ద పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులపాటు వసంత నవరాత్రులు జరుపుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉన్న రోజు కాబట్టి దీనికి చైత్రము అనే పేరు వచ్చిందని కూడా చెపుతారు.సూర్యుడు కూడా మొదటి రాశియైన మేష రాశిలో సంచరిస్తున్నాడు. రామాయణంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ తొమ్మిది రోజులలో జరిగాయి. రాముడు జన్మించినది మొదలు, వనవాసానికి వెళ్లటం, దశరథుడి మరణం, సీతాపహరణం, రావణుడి సంహారానంతరం సీతారాములు అయోధ్యానగరానికి చేరటం, శ్రీరామపట్టాభిషేకము వంటివి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి.
Ugadi : ఈ రోజే జరుపుకోవాలి..
ఉగాది నాడు దేవాలయాల్లో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. ఆసంవత్సరంలో జరగబోయే అనేక ముఖ్యమైన విషయాలను పండితులు ప్రజలకు వివరిస్తారు. జనవరి నెలతో ప్రారంభమయ్యే ఇంగ్లీషు వారి క్యాలెండర్ మాదిరిగానే తెలుగువారి పంచాంగం చైత్ర శుద్ద పాడ్యమితో మొదలవుతుంది.అయితే ఒకప్పుడు ఇంట్లోకి వెళ్లేముందు కాళ్లు కడుక్కుని వెళ్లేవారు. ప్రస్తుతం అది అందరికి సాధ్యపడటం లేదు. అందుకే ఇంటి ముందు ఇది కట్టడం వల్ల ఎటువంటి నెగిటీవ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. ఒక కొబ్బరికాయ తీసుకుని పసుపు రాసి కుంకుమతో స్వస్తిక్ ఆకారాన్ని రాయాలి. ఈ కొబ్బరికాయను ఎర్రగుడ్డలో కట్టి 5 పసుపుకొమ్ములు, కొన్ని అక్షింతలు వేసి ముడి వేయాలి. దీన్ని ఇంటిముందు కడితే ఎలాంటి చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు.