Brahmam Gari Kalagnanam : కాలజ్ఞానం ప్రకారం 2024 నుంచి జరగబోయే విధ్వంసం ఇదే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brahmam Gari Kalagnanam : కాలజ్ఞానం ప్రకారం 2024 నుంచి జరగబోయే విధ్వంసం ఇదే

 Authored By kranthi | The Telugu News | Updated on :16 August 2023,1:00 pm

Brahmam Gari Kalagnanam : కాలజ్ఞానం అంటే తెలుసు కదా. ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే విషయాలను ముందే బ్రహ్మంగారు చెప్పేశారు. ఆయన కాలజ్ఞానం పుస్తకంలో భవిష్యత్తులో ఏం జరుగుతాయో వివరించారు. అవి కూడా జరుగుతున్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని తెలుసు కదా. తాళపత్ర గ్రంథాలలో ఆయన రాశారు. భవిష్యత్తులో జరిగేవన్నీ ఆయన అందులో పొందుపరిచారు. ఆయన ఒకేసారి కాలజ్ఞానం రాయలేదు. చాలాసార్లు ఆయన రాశారు. ఆయన రాసిన ఎన్నో విషయాలు జరిగాయి. అందుకే ఆయన కాలజ్ఞానంలో ఉన్న విషయాలన్నీ జరగబోతాయని ప్రజలు నమ్ముతున్నారు.

ఆయన కాశిలోని దేవాలయం 40 రోజులు మూతపడుతుంది అని రాశారు. ఆయన చెప్పినట్టుగా 1910 లో గంగానదికి వరదలు రావడంతో కలరా వ్యాధి వ్యాపించి 40 రోజులు గుడి మూతపడింది. రాచరిక వ్యవస్థ నశిస్తుంది అన్నారు. ఒక అంబ దేశాన్ని శాసిస్తుంది అన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అన్నారు. జనసంఖ్య పెరుగుతుంది అన్నారు. చిత్రవిచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ.. చావుపుట్టుకల మర్మం తెలుసుకోలేకపోతారు అన్నారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు అన్నారు. దీంతో నీటి నుంచి విద్యుత్ వస్తోంది. కపట యోగులు పెరిగిపోతారు అన్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారన్నారు.

Brahmam Gari Kalagnanam in 2024

Brahmam Gari Kalagnanam in 2024

 

Brahmam Gari Kalagnanam : మళ్లీ ప్రకృతి ప్రకోపానికి గురి కాబోతున్నామా?

కృష్ణా నది కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది అని చెప్పారు. 5000 ఏళ్ల తర్వాత గంగ కనిపించదు. చెన్నకేశవస్వామి మహిమలు నాశనం అవుతాయి. కృష్ణానదిలో బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వాళ్ల కళ్లు పోతాయి. వేపచెట్టు నుంచి అమృతం కారుతుంది. 2024 లో ప్రకృతి ప్రకోపానికి మనుషులు గురయ్యే అవకాశం ఉంది అని బ్రహ్మంగారు రాశారు. మనుషుల్లో పాపం పెరుగుతుంది. వావి వరసలు మరుస్తారు. ఒకరిని మరొకరు చంపుకుంటారు. ఇంకా దారుణమైన పరిస్థితులు మనం చూసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా వ్యాధులు, వైరస్ లు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేయనున్నాయి. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితం తన కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది