Chanakya : ఈ చాణక్య సూత్రాలతో ఓ వ్యక్తిపై సరైన అంచనా.. అవేమిటంటే?
Chanakya : ప్రస్తుత కలియుగంలో వ్యక్తులను అంత త్వరగా నమ్మడం మంచిది కాదని పెద్దలు చెప్తుంటారు. అయితే, నమ్మకమే జీవితం కదా.. నమ్మకుంటే పనులు ఎలా సాగుతాయని వాదించే వారూ ఉన్నారు. అది నిజమే. కానీ, అలా అని చెప్పి ఎవరిని పడితే వారిని నమ్మతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే ఉత్తమ జీవిత అధ్యాపకుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన వాక్కులను .. సూత్రాలుగా భావించి వాటి ఆధారంగా వ్యక్తిపై అంచనాకు వస్తే మంచిది. అవేంటో తెలుసుకుందాం.ఏళ్ల కిందట చాణక్యుడు చెప్పిన వాక్యాలు చదివి నేటికీ స్ఫూర్తి పొందొచ్చు.
అంతటి గొప్ప సూత్రాలు అవి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించి అందులో మానవుడికి అవసరమైన విషయాలన్నిటినీ పొందుపరిచాడు. వాటిని పాటిస్తే మానవుడి సమస్యలన్నీ పరిష్కరించబడుతాయి. ఈ నీతిశాస్త్రం గ్రంథం బాగా పాపులర్ గ్రంథం. వీటి ఆధారంగా ఏ వ్యక్తినైనా ఈజీగా అంచనా వేయొచ్చు. సదరు వ్యక్తిని ఎంత మేరకు నమ్మొచ్చనేది తేల్చొచ్చు. చాణక్య నీతి శాస్త్రంలోని ఐదో అధ్యాయం ప్రకారం.. నాలుగు పద్ధతుల ద్వారా ఏ వ్యక్తినైనా పరిశీలించొచ్చు.వ్యక్తి పరిత్యాగ స్ఫూర్తిని చూడాలి. అనగా వ్యక్తిని నమ్మే ముందర సదరు వ్యక్తి ఇతరుల జీవితంలో సంతోషం కోసం ఎంత త్యాగం చేయగలడు, ఇతరులను బాధలను అర్థం చేసుకోగలడా.
Chanakya : తన మేథస్సుతో ప్రపంచాన్ని జయించిన చాణక్యుడు.
.అనే విషయాలపై అంచనా వేసుకున్న తర్వాతనే సదరు వ్యక్తిపై ఓ అంచనాకు రావాలి. సదరు వ్యక్తి చరిత్రను పరిశీలించాలి. వ్యక్తి యోగ్యుడేనా కాదా అనేది అతని చరిత్రను బట్టి తెలుస్తోంది. వ్యక్తి లక్షణాలను సునిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. వ్యక్తి ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి. సోమరితనంతో వ్యవహరిస్తున్నాడా? లేదా అబద్ధాలు ఆడుతున్నాడా? ప్రశాంతంగా ఉంటున్నాడా? ఏ పని పట్ల ఆసక్తి చూపుతున్నాడా., సత్యం మాట్లాడుతున్నాడా, లేదా అనే విషయాలపై స్టడీ చేయాలి. దాంతో పాటు వ్యక్తి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడా లేదా అనేది తెలుసుకోవాలి. మత మార్గం ద్వారా ఇతరులకు సాయం చేసే గుణం ఉందా లేదా అనేది పరిశీలించాలి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించే వ్యక్తులను అస్సలు నమ్మొద్దు.