Chanakya | చాణక్య నీతి ప్రకారం వీరిని దూరం పెట్టండి.. విజయానికి అడ్డంకిగా మారే నాలుగు రకాల వ్యక్తులు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanakya | చాణక్య నీతి ప్రకారం వీరిని దూరం పెట్టండి.. విజయానికి అడ్డంకిగా మారే నాలుగు రకాల వ్యక్తులు!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 October 2025,6:00 am

Chanakya |  మహానీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి గ్రంథంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విలువైన సూత్రాలను చెప్పారు.. చాణక్యుడి ప్రకారం కొంద‌రు వ్యక్తులు మన విజయానికి అడ్డుగోడలా మారి, జీవితంలో పురోగతిని అడ్డుకుంటారు.

#image_title

ఇప్పుడు ఆయన సూచించిన ఆ వ్యక్తుల గురించి తెలుసుకుందాం

1. ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులు

చాణక్యుడి ప్రకారం నెగటివ్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి.
ఇలాంటి వారు ఎప్పుడూ తప్పులు వెతుకుతారు, మనోధైర్యాన్ని బలహీనపరుస్తారు, ప్రతి పనిలో అడ్డంకిగా నిలుస్తారు. వీలైనంత త్వరగా వీరి ప్రభావం నుంచి బయటపడితేనే మన ఆలోచనలు సానుకూల దిశగా మలుస్తాయి.

2. సోమరులు

చాణక్యుడి నీతి ప్రకారం సోమరితనం మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది.ఇలాంటి వారు తమ జీవితంలో విజయం సాధించరు, ఇతరులను కూడా వెనక్కు లాగుతారు.కష్టపడే వారిని తప్పుదారి పట్టించడం, ఆలస్యానికి అలవాటు పడడం వీరి లక్షణాలు.

3. అసూయపడే వ్యక్తులు

ఇతరుల అభివృద్ధి చూసి అసూయపడే వారు మన విజయానికి పెద్ద అడ్డంకి అవుతారు.
చాణక్యుడి ప్రకారం ఇలాంటి వ్యక్తులు మన విజయాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు.

4. నమ్మకాన్ని దెబ్బతీసే వ్యక్తులు

జీవితంలో విజయవంతం కావాలంటే ద్రోహులు, మోసగాళ్లు లాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించాడు.వీరు అవసరమైన సమయంలో మిమ్మల్ని మోసం చేసి, తమ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తారు.

చాణక్యుడు చెప్పిన సారాంశం:
మన చుట్టూ ఉన్న వ్యక్తులే మన భవిష్యత్తును నిర్ణయిస్తారు. సానుకూలమైన, నమ్మకమైన, కష్టపడే వ్యక్తులతో ఉంటే విజయం మీది అవుతుంది

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది