Chanakya Niti : కష్ట,సుఖాలలో తోడుగా ఉండే స్నేహితుని ఎంపిక చేసుకునే విషయాలను…. చెప్తున్న చాణక్య…
Chanakya Niti : జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి. ఎవరికి దూరంగా ఉండాలి. జీవితంలో విజయాలను ఎలా అందుకోవాలి. ఇలా కొన్ని విషయాలను చాణిక్య తెలియజేశారు. ఇలా చాణక్య చెప్పిన విషయాలను పాటిస్తే జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. కాబట్టి ఆచార్య చెప్పిన స్నేహితులను, అతిథులు ఏ విధంగా గుర్తించాలో కొన్ని విషయాలకు సంబంధించి కొన్ని వివరాలను తెలియజేశారు. అందరి జీవన విధానంలో సంతోషాలు వస్తూ పోతూ ఉంటాయి. అయితే పలుమార్లు జీవితంలో ఇబ్బందులు రావడానికి మనమే కారణమవుతుంటాము. అంటే మనము ఉండే విధానము, ఆలోచించి విధానము కొన్ని సమయాలలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
కాబట్టి మనతో ఉండే మనుషులు కొందరు మన పట్ల ఏ విధంగా ఉంటారు తప్పక చూసుకుంటూ ఉండాలి. మన చుట్టూ ఉండేవారు మనకి కష్టాలు రావడానికి కారణం అవుతూ ఉంటారు.అదేవిధంగా కొందరు మంచి మనస్తత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తిలో త్యాగం చేసే గుణం ఉన్నట్లు చాణక్య తెలియజేశారు. అలాగే ఎవరినైనా గమనించడానికి ఆ వ్యక్తికి ఇబ్బందులకి తగ్గట్లుగా తన స్నేహాన్ని త్యాగం చేసే వ్యక్తిత్వం కలిగి ఉన్నాడా.. లేదా ..అనేది గమనించాలి. మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వారు మిమ్ములను తప్పించుకొని తిరుగు వారైతే వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఎలాంటి సమస్య వచ్చిన కష్టసుఖాల్లో మిమ్మల్ని వదలకుండా మీకు ఎప్పుడు తోడుగా ఉండే వారితో మీరు వారిని ఎప్పటికీ వదులుకోవద్దు. అలాంటి మంచి గుణం ఉన్న వారికోసం మీరు ఎలాంటి త్యాగం చేయవలసి వచ్చిన మీరు తప్పనిసరిగా ఆ వ్యక్తిని గుర్తు పెట్టుకోవాలి.
అదేవిధంగా కొందరు ద్రోహం చేసే వారు ఉంటారు. అలాంటి వారిని తెలుసుకోవాలి అంటే.. అప్పుడు దానికోసం కొంచెం ధనాన్ని ఆ వ్యక్తికి ఆశ చూపించి తన గుణం ఏంటో తెలుసుకోవాలి. అని చెప్తున్నాడు చాణిక్య. అంటే మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి కొంత సమయంలో ఇచ్చిన వాడైతే ఆ వ్యక్తితో మీరు స్నేహంగా ఉండవచ్చు. అదేవిధంగా ధనం తిరిగి ఇవ్వని వ్యక్తి, అనుకున్న సమయానికి ఇవ్వలేని వాడు అలాంటి మోసగాళ్ల తో సన్నిహితంగా అస్సలు ఉండవద్దు. అసలు వారి స్నేహమే మర్చిపోవాలి. అని ఇలా కొన్ని విషయాలను చాణిక్య తెలియజేశారు.