Chanakya Niti : ఈ 6 లక్షణాలు ఉంటేనే లక్ష్మి కటాక్షం, సంపద దక్కుతుంది అంటున్న చాణిక్య…!!
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు జీవితం గురించి పలు సూక్తులను బోధించాడు. జీవితంలో ఎలా ఉంటే జీవితం సాగుతుందో.. అనే కొన్ని విషయాలను ఆయన బోధించడం జరిగింది. పెద్దలు చెప్పిన సామెతలు కష్టేఫలి అనే మాట అందరూ వినే ఉంటారు. కష్టపడితేనే ఫలితాలు దక్కించుకోవచ్చు.. ఆలస్యంగా, నీరసంగా కూర్చుంటే మనతోపాటు ఉన్నవాళ్లు మనల్ని దాటుకొని ముందుకు వెళ్లి పోతారు. కానీ మనం అక్కడే కూర్చుంటాం. కావున కష్టపడితేనే ఫలితాలు అందుతాయని చెప్తుంటారు. మన పెద్దలు. ఈ […]
Chanakya Niti : ఆచార్య చాణిక్యుడు జీవితం గురించి పలు సూక్తులను బోధించాడు. జీవితంలో ఎలా ఉంటే జీవితం సాగుతుందో.. అనే కొన్ని విషయాలను ఆయన బోధించడం జరిగింది.
పెద్దలు చెప్పిన సామెతలు కష్టేఫలి అనే మాట అందరూ వినే ఉంటారు. కష్టపడితేనే ఫలితాలు దక్కించుకోవచ్చు.. ఆలస్యంగా, నీరసంగా కూర్చుంటే మనతోపాటు ఉన్నవాళ్లు మనల్ని దాటుకొని ముందుకు వెళ్లి పోతారు. కానీ మనం అక్కడే కూర్చుంటాం. కావున కష్టపడితేనే ఫలితాలు అందుతాయని చెప్తుంటారు. మన పెద్దలు. ఈ క్రమంలో ఆచార్య చానిక్యుడు చాలా నీతులు చెప్పాడు. మంచి వ్యూహకర్త ఆర్థికవేత్తగా ప్రసిద్ధి పొందిన ఆచార్య చాణక్యుడు. నిజ జీవితం గురించి ఎన్నో పుస్తకాలను రాశాడు.
ఆయన చెప్పిన కొన్ని నీతి సూత్రాలు మూలంగా ఆయనకు కౌటిల్యుడు అనే బిరుదు వచ్చింది. ఆయన రాసిన నీతి పుస్తకం కూడా ఎంతో ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఆయన నీతి గ్రంధంలో ఎన్నో అంశాలను ప్రస్తావించాడు. ఆయన రాసిన చాణిక్యనీతి ఈనాటికి ప్రజలకు సరైన దారిని చూపిస్తూ ఉంది. మానవ జీవితంలో సంపదలు పోగు చేసుకోవడానికి అలాగే లక్ష్మీ కటాక్షం అందుకోవడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయాలను కూడా ఆయన రచించాడు. అయితే నీతి శాస్త్ర ప్రకారంగా ఎలాంటి లక్షణాలు ఉన్నవాళ్లకి లక్ష్మీ కటాక్షకం అలాగే సంపదలు లభిస్తాయి మనం ఇప్పుడు చూద్దాం… అదృష్టాన్ని ఆశ్రయించిన వారు : అదృష్టం వస్తుందని అదృష్టం వచ్చినప్పుడు సంపద వస్తుందని నమ్మి ధనం పొదుపు చేయని వాళ్ళు ఎప్పటికీ డబ్బు కూడా పెట్టలేరు.
కాబట్టి అదృష్టం కోసం ఎదురు చూడకుండా దానికోసం కష్టపడాలి అని చాణిక్యుడు తెలిపాడు. పొదుపు :పొదుపు అనేది సంపదని కూడా పెట్టుకుని ముఖ్యమైన లక్షణం. పొదుపు చేసేవాళ్లు ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకుంటారు. తమ డబ్బును ఎలా ఖర్చు చేస్తారని దాని గురించి తెలివైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. నిజాయితీ : సంపదను పోగు చేసుకునేవాడు నిజాయితీ ఒక ముఖ్యమైన లక్షణం. ఇతరులతో తమ వ్యవహారాలలో నిజాయితీగా ఉండే మనుషులు ఇతరులకు గౌరవాన్ని విశ్వాసాన్ని పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది వ్యాపారానికి మరింత అవకాశాలను పొందేలా చేస్తుంది. నెట్వర్కింగ్ సంపదను కూడా పెట్టుకోవడానికి ఇతరులలో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబం, స్నేహితులు,
వ్యాపార సహచరులు బలమైన నెట్వర్కులను కలిగి ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలను పొందే ఛాన్సులు ఉంటాయి. కష్టపడే లక్షణం : కష్టపడి పని చేసే వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. శ్రద్ధగా పనిచేసే వ్యక్తులు వారి జీవితంలో సంపదలను సృష్టిస్తారని కూడా చానిక్యుడు చెప్పాడు. కష్టించే గుణాలు ఉన్నవాళ్లు అవకాశాల్ని సృష్టించుకుని వాటి ద్వారా ప్రయోజనం పొందుతారని చాణిక్య తెలియజేశారు. శ్రమించే వాళ్ళకి సంపద శ్రేయస్సు సిద్ధిస్తాయి. సోమరితనం క్రమశిక్షణ లేని వారికి ఎప్పుడు సంపద దొరకనే దొరకదు.. తెలివితేటలు : చాణిక్యనీతి ప్రకారం తెలివితేటలు జ్ఞానం మంచి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉన్నవారు. సంపదను కూడ గట్టుకుంటారు. అలాగే వాళ్లు లాభదాయకమైన అవకాశాలను తెలుసుకోగలరు. తెలివిగా పెట్టుబడును పెట్టగలరు.