Lakshmi Devi : శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేయకండి.. కటిక దరిద్రులవుతారు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi : శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేయకండి.. కటిక దరిద్రులవుతారు..!!

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2023,7:00 am

Lakshmi Devi : పవిత్ర శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పొరపాటున ఈ పువ్వుతో పూజ చేస్తే అడుక్కుతినే స్టేజ్ కి వెళ్ళిపోతారు. మరి ఈ పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎలాంటి పువ్వులతో పూజ చేయాలి. లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ కూడా ఈ మనం తెలుసుకుందాం.. పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పొరపాటున కూడా ఈ పువ్వుతో పూజ చేసే అడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోతారని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మరి మీకు తెలియకుండా ఈ పువ్వుతో మీరు పూజ చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. శ్రావణమాసంలో హిందువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మాంసాహారం భుజించకూడదు. చెడు ఆలోచనలు చేయకూడదు. మద్యపానం అసలే చేయకూడదు.

శ్రావణమాసంలో మన ఇంట్లో ఉప్పును ఎవరికి దానం ఇవ్వడం గానీ లేదా అప్పు ఇవ్వడం గానీ చేయకూడదు. ఇంట్లో ఆడవారు నెలసరిలో ఉంటే కనుక ఆ ఇంట్లో వారు దేవాలయాలకు వెళ్ళకూడదు. పూజలు చేయకూడదు. ఇక శ్రావణమాసంలో మంగళ శుక్రవారంలో మీరు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వడం గానీ లేదా వారి నుంచి అప్పుగా తీసుకోవడం గాని చేయవద్దు. ఇలాంటి పనులు ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తాయి. ఇక శ్రావణమాసంలో లక్ష్మీదేవికి పూజ చేయాలి అనుకునేవారు మాంసాహారం భుజించకుండా ఉండాలి. అంతేకాదు ఒంటిపూట భోజనం చేస్తూ లక్ష్మి ఆరాధనలో గడుపుతూ ఉండాలి. శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం భార్య భర్తలు శారీరకంగా కలవకుండా ఉండాలి. అదేవిధంగా శ్రావణ మాసంలో మంగళ శుక్రవారంలో నల్లటి దుస్తులు ధరించకూడదు.

Do not mistakenly worship Lakshmi Devi with this flower during the month of Shravana

Do not mistakenly worship Lakshmi Devi with this flower during the month of Shravana

శ్రావణమాసంలో మంగళ, శుక్రవారంలో పొరపాటున కూడా గోరులు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం లాంటిది చేయకూడదు. ఇక లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పొరపాటున కూడా పూజలో వాడకూడని పువ్వులు ఏంటో తెలుసుకుందాం.. ముళ్ళు ఉన్నటువంటి పువ్వుల్లో గులాబీ పువ్వులు మాత్రమే లక్ష్మీదేవికి ఇష్టమైనవి.. అలానే వాసన లేని పువ్వులతో కూడా లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించకూడదు.. లక్ష్మి అమ్మవారిని కలవ పువ్వులతో పూజ చేస్తే కనుక దరిద్రం తొలగిపోతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివాసం ఉండాలంటే పారిజాత పువ్వులతో లక్ష్మీదేవిని పూజించాలి. అయితే ఈ పారిజాత పుష్పాలను ఎప్పుడూ కూడా పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చెట్టుకున్న పువ్వులు కోయరాదు. ఎందుకంటే పారిజాత చెట్టు యొక్క రాలిన పుష్పాలు మాత్రమే లక్ష్మి పూజకు వాడాలి. లక్ష్మీదేవి పూజకు వాడే పువ్వైనా సూచిక శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపినటువంటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించకూడదు.

వీలైనంత మేర చెట్టు నుండి కోసిన వెంటనే లక్ష్మీదేవి పూజకు వాడటం మంచిది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే నెలసరిలో ఉంటారో వారు పువ్వులను అంటుకుంటే ఆ పూలు లక్ష్మీదేవి పూజ చేయడానికి పనికిరావు.. లక్ష్మీదేవి అమ్మవారికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పూలు సమర్పించకూడదు.. లక్ష్మీ అమ్మవారికి అసలు నచ్చని పువ్వు ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వుతో పూజ చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అమ్మవారి పూజకు ఉమ్మెత్త పువ్వు అసలు పనికిరాదు. అలాగే దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి, నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించే దీపారాధన చాలా నిష్టతో భక్తితో చేయాలి. దీపం వెలిగే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి అలాంటి దీపాన్ని ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా వెలిగించాలి. భక్తిశ్రద్ధలతో వెలిగించాలి దీపానికి శక్తులు అనేది ఎల్లవేళలా ఉంటాయి. ఆ శక్తిని కాపాడుతూ ఉంటాయని ఇటువంటి లక్ష్మీదేవి మన ఇంటా కొలువై ఉంటుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది