Kaala Sarpa Dosham : మీకు కాల సర్ప దోషం ఉందా… అయితే, శ్రావణ మాసంలో శివునికి ఈ జంట సర్పాలను అర్పించండి…?
ప్రధానాంశాలు:
Kaala Sarpa Dosham : మీకు కాల సర్ప దోషం ఉందా... అయితే, శ్రావణ మాసంలో శివునికి ఈ జంట సర్పాలను అర్పించండి...?

Kaala Sarpa Dosham : మీకు కాల సర్ప దోషం ఉందా… అయితే, శ్రావణ మాసంలో శివునికి ఈ జంట సర్పాలను అర్పించండి…?
శ్రావణ మాసము ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసంలో ప్రజలందరూ కూడా ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటారు. ఈ మాసంలో అమ్మవార్లను ఎక్కువగా పూజిస్తారు. ఈ మాసం మొత్తం కూడా ఆధ్యాత్మికతకు నెలవు. కా ఈ శ్రావణ మాసంలో శివ భక్తులు పూజలు చేసి మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసాలు కూడా ఉంటారు. ఈ పూజా క్రమంలోనే అనేక వస్తువులను సమర్పిస్తూ ఉంటారు, వాటిలో ఒకటి జంట పాములు. ఈ జంట పాములను కాలసర్ప దోషం ఉన్నవారు వెండితో చేసిన పాములను శివునికి సమర్పించడం పవిత్రమైనదిగా భావిస్తారు. మరి ఈ శ్రావణ మాసంలో శివలింగానికి వెండి పాములను, అంటే జంట పాములను సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…
Kaala Sarpa Dosham శివయ్యకు జంట పాములను ఎందుకు సమర్పిస్తారు
శ్రావణమాసంలో శివయ్యకు జంట పాములను అంటే వెండితో చేసిన నాగు పాములను సమర్పిస్తే, సాధారణంగా వెండి లేదా పంచలోహాలతో చేసిన జంట పాములను శివలింగానికి సమర్పిస్తారు. దీనిని నాగపంచమీ, లేదా మాస శివరాత్రి వంటి శుభసందర్బాలలో సమర్పిస్తే చాలా శుభప్రదంగా పరిగణించడం జరిగింది.అయితే,శ్రావణమాసంలో ఏ రోజునైనా శివునికి వెండి జత పాములను సమర్పించడం,చాలా పవిత్రమైనదిగా పరిగణించడం జరిగింది. మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం.. శ్రావణమాసంలో కొన్ని మత విశ్వాసాలు శివునికి వెండి జంట పాములను సమర్పించడం వల్ల, కాలసర్ప దోషం నివారణ జరుగుతుందని నమ్ముతారు. సిరిసంపదలతో పాటు, సుఖసంతోషాలు కూడా కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే, శ్రావణమాసంలో శివలింగానికి వెండి పాముల జతను సమర్పిస్తే,శివుని ఆశీర్వాదం తప్పక లభిస్తుందని. అంతేకాక,ప్రతికూల శక్తి ప్రభావం తొలగిపోవడానికి ఇది ఒక సులభమైన మార్గంగా పరిగణించడం జరిగింది.
శివయ్యకు జంట సర్పాలను ఎలా సమర్పించాలి
జంట సర్పాలను సమర్పించడం అనేది ఒక మతపరమైన కార్యక్రమం. ఇది కాలసర్ప దోషం నుంచే బయటపడడానికి ఇంకా, శివుని ఆశీర్వాదము పొందడానికి ఇలా వెండితో చేసిన జంట సర్పాలను శివయ్యకు సమర్పిస్తుంటారు.
వెండితో లేదా రాగితో చేసిన పాముల జంట : మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో లేదా పూజా సామాగ్రి అమ్మే దుకాణం నుంచి, వెండి లేదా రాగి పాములను కొనుగోలు చేయవచ్చు.
ఏ రోజున జంట పాములను సమర్పించాలి : వెండితో చేసిన జంట సర్పాలను లేదా రాగితో చేసిన జంట సర్పాలను,నాగపంచమి లేదా సోమవారం లేదా శ్రావణ సోమవారం సమర్పిస్తే శుభప్రదం.
ఆలయానికి వెళ్ళండి : శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించబడిన ఆలయానికి వెళ్లి శివయ్యను దర్శించండి.
అభిషేకం చేయండి : శివుడిని పంచామృతాలతో అభిషేకం చేయండి.శివయ్య అనుగ్రహం కలుగుతుంది.
జంట సర్పాలను ప్రతిష్టించండి : మీరు వెండితో చేసిన జంట సర్పాలను శివలింగం దగ్గర,అంటే ఆలయంలో శివుని దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జంట సర్పాలను శివయ్యకు సమర్పించండి.ఇలా చేస్తే మీకు సర్ప దోషం నివారించబడుతుంది.
మంత్రాన్ని జపించండి : వెండి సర్పాలను శివయ్యకు సమర్పించేటప్పుడు “ఓం నమః శివాయ “లేదా” ఓం నాగేంద్రహారాయ నమః “అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించండి.